ట్రంప్ 25శాతం టారిఫ్‌ విధించినా నో ప్రాబ్లమ్..! ఇండియాలో ఐఫోన్‌లు అమెరికాతో పోలిస్తే చాలాచౌక.. ధరల్లో తేడా ఇలా.. వెల్లడించిన జీటీఆర్ఐ నివేదిక

భారత్‌లో తయారయ్యే ఐఫోన్ల పై అమెరికాలో సుంకాలు విధించినప్పటికీ భారత దేశంలో ఐఫోన్ల తయారీ ఖర్చు అమెరికాలో కంటే తక్కువే అవుతుందని జీటీఆర్‌ఐ తన నివేదికలో వెల్లడించింది.

ట్రంప్ 25శాతం టారిఫ్‌ విధించినా నో ప్రాబ్లమ్..! ఇండియాలో ఐఫోన్‌లు అమెరికాతో పోలిస్తే చాలాచౌక.. ధరల్లో తేడా ఇలా.. వెల్లడించిన జీటీఆర్ఐ నివేదిక

Donald Trump

Updated On : May 25, 2025 / 10:14 AM IST

Donald Trump: భారత దేశంలో యాపిల్ సంస్థ ఐఫోన్ల తయారీ ప్లాంట్లను నిర్మించొద్దని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ సంస్థ సీఈఓ టీమ్ కుక్ కు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఐఫోన్లను అమెరికాలోనే తయారు చేయాలంటూ టెక్‌ కంపెనీపై ట్రంప్ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. రెండ్రోజుల క్రితం ఇదే విషయంపై ట్రంప్ మాట్లాడుతూ.. యాపిల్‌ తన ప్లాంట్లను నిర్మించడానికి భారత్‌కు వెళ్లొచ్చని, కానీ ఆ టెక్‌ కంపెనీ సుంకాలు లేకుండా అమెరికాలో తన ఉత్పత్తులను విక్రయించడానికి వీలుండదని అన్నారు.

 

యాపిల్‌ ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్‌ విధించాలని నిర్ణయించామని తన సొంత ‘ట్రూత్‌ సోషల్‌’ వేదికగా ట్రంప్‌ వెల్లడించారు. దీంతో ఆ కంపెనీ షేర్లు శుక్రవారం 2.5శాతం పడిపోయాయి. ఈ క్రమంలో గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనిషియేటివ్‌ (జీటీఆర్‌ఐ) తన నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది.

భారత్‌లో తయారయ్యే ఐఫోన్ల పై అమెరికాలో సుంకాలు విధించినప్పటికీ భారత దేశంలో ఐఫోన్ల తయారీ ఖర్చు అమెరికాలో కంటే తక్కువే అవుతుందని జీటీఆర్‌ఐ తన నివేదికలో వెల్లడించింది. భారత్‌లో తక్కువ ఉత్పత్తి వ్యయాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటివి దీనికి దోహదం చేస్తాయని పేర్కొంది.

 

జీటీఆర్‌ఐ నివేదిక ప్రకారం..
♦ వెయ్యి డాలర్ల ధర ఉండే ఒక ఐఫోన్ లో యాపిల్ బ్రాండ్, సాఫ్ట్ వేర్, డిజైన్ వాటా 450 డాలర్లు ఉంటుంది.
♦ అమెరికా (క్వాల్‌కామ్. బ్రాండ్ కామ్) కాపోనెంట్స్ వాటా 80డాలర్లు.
♦ తేవాన్ చిప్స్ వాటా 150 డాలర్లు.
♦ సౌత్ కొరియా ఓఎల్ఈడీ స్క్రీన్స్, మెమరీ చిప్స్ వాటా 90 డాలర్లు.
♦ జపాన్ కెమెరా సిస్టమ్స్ వాటా 85 డాలర్లు.
♦ జర్మనీ, వియత్నాం, మలేషియా నుంచి వచ్చే చిన్న పార్ట్స్ వాటా 45 డాలర్ల దగ్గర ఉంటుంది.
♦ చైనా, ఇండియాలో అసెంబుల్ చేసినా ఒక్కో ఫోన్ పై 30డాలర్లు మాత్రమే ఖర్చు వస్తుంది. ఇది ఐఫోన్ రిటైల్ ప్రైస్ లో 3శాతం కంటే తక్కువ.

25శాతం టారిఫ్ విధించినా నో ప్రాబ్లం..
♦ ఇండియాలో ఒక ఐఫోన్ అసెంబుల్ కాస్ట్ 30 డాలర్లు. అమెరికాలో అయితే 390 డాలర్లు ఉంటుంది.
♦ ఇండియాలో వర్కర్స్ నెల జీతం సగటున 230 డాలర్లు (సుమారు రూ.19వేలు). అదే అమెరికాలో (కాలిఫోర్నియా వంటి స్టేట్స్ లో) 2,900 డాలర్లు ( సుమారు 2.4లక్షలు).
♦ భారత దేశంతో పోలిస్తే అమెరికాలో 13రెట్లు ఎక్కువ.
♦ ఇండియాలో ఐఫోన్ తయారీకి ప్రభుత్వం నుంచి ప్రొడన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) కూడా వస్తుంది.
♦ ట్రంప్ చెప్పినట్లు భారత దేశంలోని తయారైన ఐఫోన్ల పై అమెరికాలో 25శాతం టారిఫ్ విధిస్తే.. ఇండియాలో ఫోన్ల తయారు చేయడం వలన యాపిల్ కు డబ్బులు ఆదా అవుతాయి.