Jharkhand Elections 2024: జార్ఖండ్‌లో కొలిక్కి వచ్చిన సీట్ల పంపకం.. బీజేపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందంటే..

రాంచీలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జార్ఖండ్ బీజేపీ ఎన్నికల ఇన్ ఛార్జ్ శివరాజ్ సింగ్ చౌహాన్, కో-ఇన్ ఛార్జ్ హిమంత బిస్వా శర్మ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

Jharkhand Assembly elections 2024

Jharkhand Assembly Elections 2024: జార్ఖండ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. రెండు దశల్లో అక్కడ పోలింగ్ జరగనుంది. దీంతో ఎన్డీయే కూటమి పార్టీలైన బీజేపీ, ఏజేఎస్‌యూ, జేడీయూ, ఎల్‌జేపీ (రామ్‌విలాస్) పార్టీల మధ్య సీట్ల పంపకంపై కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఆ చర్చలు కొలిక్కి వచ్చాయి. రాంచీలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జార్ఖండ్ బీజేపీ ఎన్నికల ఇన్ ఛార్జ్ శివరాజ్ సింగ్ చౌహాన్, కో-ఇన్ ఛార్జ్ హిమంత బిస్వా శర్మ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

Also Read: మహాయుతి వర్సెస్ మహా వికాస్ అఘాడీ.. మహారాష్ట్ర ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలేంటి?

జార్ఖండ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమిగా నాలుగు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. వీటిలో బీజేపీకి 68 స్థానాలు, ఏజేఎస్‌యూ 10, జేడీయూ రెండు, ఎల్‌జేపీ (రామ్‌విలాస్) ఒక స్థానంలో పోటీ చేయనున్నాయి. శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ, ఏజేఎస్‌యూ, జేడీయూ, ఎల్‌జేపీ (రామ్‌విలాస్) కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. అందరం కలిసికట్టుగా ప్రచారం చేస్తామని, బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేలా అందరం సమిష్టిగా ముందుకు సాగుతామని చెప్పారు.

Also Read: Bypolls Dates : ఉప ఎన్నికల తేదీలివే.. వాయనాడ్ లోక్‌సభ, 47 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13న పోలింగ్.. ఎన్నికల సంఘం ప్రకటన!

జార్ఖండ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. రెండు దశల్లో అక్కడ పోలింగ్ జరగనుంది. నవంబర్ 13న తొలి దశ పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 20న రెండో దశ పోలింగ్ జరగనుంది. జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 సీట్లు ఉండగా.. అందులో 44 సీట్లు అన్ రిజర్వుడ్ సీట్లు ఉన్నాయి. 28 నియోజకవర్గాల్లో ఎస్టీలకు, తొమ్మిది నియోజకవర్గాలు ఎస్సీ కేటగిరికి రిజర్వు అయ్యాయి.