మహాయుతి వర్సెస్ మహా వికాస్ అఘాడీ.. మహారాష్ట్ర ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలేంటి?
గత ఐదేళ్లలో మహా రాజకీయాల్లో చాలానే ట్విస్టులు కనిపించాయి. పొత్తుగా ఎన్నికలకు వెళ్లి పార్టీలు శత్రువులయ్యాయి.

Special Focus On Maharashtra Assembly Elections 2024
Maharashtra Assembly Elections 2024 : దేశంలో మరో ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. పార్టీలో చీలికలు, కోర్టుల్లో ఫైట్లు, కోల్పోయిన గుర్తులు, సార్వత్రిక ఎన్నికల్లో సంచలనాలు.. ఇలాంటి పరిణామాల మధ్య మహారాష్ట్ర వైపు దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది. ఫలితాలు ఎలా ఉండబోతాయా అని ఎందురుచూస్తోంది. మరి మహారాష్ట్ర రాజకీయం ఏం చెబుతోంది? మహాయుతి, మహా వికాస్ అఘాడీలో ఎవరిది పైచేయి కాబోతోంది?
జమ్ముకశ్మీర్, హరియాణా ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో మరో ఎన్నికల నగారా మోగింది. ఝార్ఖండ్ సంగతి ఎలా ఉన్నా మహారాష్ట్ర ఎన్నికలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మహారాష్ట్రలో జరగబోయేది పార్టీల మధ్య యుద్ధం మాత్రమే కాదు.. అంతకుమించి.. మారిన రాజకీయ పరిణామాలు, చీలిపోయిన పార్టీలు, విడిపోయిన ఎమ్మెల్యేలు, నమ్మకానికి, సానుభూతికి మధ్య జరిగే ఎన్నికల సమరం. దీంతో మహారాష్ట్రలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయా అని దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది.
గత ఐదేళ్లలో మహా రాజకీయాల్లో చాలానే ట్విస్టులు కనిపించాయి. పొత్తుగా ఎన్నికలకు వెళ్లి పార్టీలు శత్రువులయ్యాయి. శత్రువులు అనుకున్న పార్టీలు కొత్త మిత్రులుగా మారిపోయారు. అంతా సాఫీగా సాగుతోంది అనుకున్న టైమ్ లో పార్టీలో తిరుగుబాట్లు కనిపించాయి. బీజేపీ-శివసేన 2019 ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకున్నాయి. బీజేపీకి 105, శివసేనకు 56 సీట్లు వచ్చాయి. ఎన్సీపీ 44, కాంగ్రెస్ 54 సీట్లలో గెలిచాయి.
సీఎం పదవి విషయంలో విబేధాలు రావడంతో బీజేపీకి బైబై చెప్పిన శివసేన.. సిద్ధాంతపరంగా బద్ధ శత్రువులైన కాంగ్రెస్, ఎన్సీపీలతో పొత్తు పెట్టుకుంది. ఉద్దవ్ ఠాక్రే సీఎం అయ్యారు. ఆ తర్వాత 2022లో శివసేన నేత ఏక్ నాథ్ షిండే పార్టీని చీల్చి బీజేపీతో కలిసిపోయారు. కమలం పార్టీ మద్దతుతో ప్రస్తుతం సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత ఏడాది ఎన్సీపీలో చీలిక వచ్చింది. శరద్ పవార్ తో విభేదించి 40మంది ఎమ్మెల్యేలతో అజిత్ పవార్ మహాయుతి కూటమిలో చేరారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఈ పరిణామాలన్నింటికి ఈ ఎన్నికలు ఫైనల్ ఆన్సర్ ఇవ్వడం ఖాయం.
ఎన్నికల ముందు హరియాణాలో బీజేపీ మీద ఎలాంటి వ్యతిరేకత కనిపించిందో మహారాష్ట్రలో అలాంటి పరిస్థితులే ఉన్నాయి. వాటిని అధిగమించి బీజేపీ వండర్ క్రియేట్ చేయబోతుందా? ఇండియా కూటమిని వెంటాడుతున్న భయాలు ఏంటి? హరియానా ఓటమి నుంచి కాంగ్రెస్ పాఠాలు నేర్చుకుంటుందా? మహారాష్ట్ర ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు ఏంటి? ఏ పార్టీ ఎలాంటి ప్రచారం అందుకోబోతోంది?
Also Read : భారత్-కెనడా మధ్య వివాదానికి అసలు కారణమేంటి? ట్రూడో ఆరోపణల వెనుక వ్యూహం ఉందా?