NDA Victory: బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏకు 202, మహాగఠ్‌బంధన్‌కు 34, ఇతరులకు 7 సీట్లు దక్కిన విషయం తెలిసిందే. ఎన్నికల తర్వాత దాదాపు అన్ని సర్వే సంస్థలు ఎన్డీఏ గెలుస్తుందని చెప్పాయి.
కానీ, ఇంతటి మెజార్టీ వస్తుందని అంచనా వేయలేకపోయాయి. ఒక్క సంస్థ మాత్రం ఫైనల్ రిజల్ట్స్‌ను ముందుగానే చెప్పేసిందా? అన్నట్లు అంచనాలను కచ్చితత్వంతో వెల్లడించింది. అదే కామాఖ్యా అనలిటిక్స్. ఎన్డీఏకు 187 రావచ్చని అంచనా వేసింది. మిగతా సంస్థలతో పోల్చితే కామాఖ్యా అనలిటిక్స్ బెటర్.
ఆ సంస్థ ఎన్డీఏకు167–187, మహాగఠ్‌బంధన్‌కు 54–74, జేఎస్పీ, జేఎస్‌యూపీకి 0–2, ఇతరులకు 2–7 సీట్లు వస్తాయని చెప్పింది. దీంతో ఇతర సంస్థలన్నింటి కన్నా బెటర్‌గా అంచనా వేసిన సంస్థగా నిలిచింది.
ఏ సంస్థ ఎలా అంచనా వేసింది?
| సర్వే సంస్థ | NDA | MGB | JSP / JSUP | ఇతర / స్వతంత్రులు |
|---|---|---|---|---|
| తుది ఫలితం | 202 | 34 | — | 7 |
| కామాఖ్యా అనలిటిక్స్ | 167–187 | 54–74 | 0–2 | 2–7 |
| మాట్రైజ్ | 147–167 | 70–90 | 5 | 10 |
| టుడే’స్ చాణక్య | 148–172 | 65–89 | — | 3–9 |
| భాస్కర్ | 145–160 | 73–91 | — | 5–10 |
| పి-మార్క్ | 142–162 | 80–98 | 1–4 | 0–3 |
| పీపుల్స్ పల్స్ | 133–159 | 75–101 | 0–5 | 2–8 |
| జేవీసీ | 135–150 | 88–103 | — | 3–7 |
| పోల్స్‌ట్రాట్ | 133–148 | 87–102 | — | 3–5 |
| పీపుల్స్ ఇన్సైట్ | 133–148 | 87–102 | 0–2 | 3–6 |
| వోట్ వైబ్ | 125–145 | 95–115 | 0–2 | 1–3 |
| ఆక్సిస్ మై ఇండియా | 121–141 | 98–118 | 0–2 | 1–5 |
| న్యూస్ పించ్ / ఏఐ పాలిటిక్స్ | 115–127 | 113–125 | — | 1–5 |
| ధ్రువ్ | 132–156 | 85–108 | — | 1–4 |