NEET Results : నీట్ ఫలితాలు విడుదల.. టాపర్ మనోడే, జాతీయ స్థాయిలో మెరిసిన ఏపీ విద్యార్థి

NEET Results : ఈ ఏడాది నీట్ కు దేశవ్యాప్తంగా మొత్తం 11లక్షల 45వేల 976 మంది అర్హత సాధించగా..

NEET UG 2023 Results

NEET UG 2023 Results : దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూసిన నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయి. ఈ రిజల్ట్స్ లో ఏపీకి చెందిన విద్యార్థి సత్తా చాటాడు. ఆలిండియా స్తాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఏపీకి చెందిన బోరా వరుణ్ చక్రవర్తి, తమిళనాడుకి చెందిన ప్రభంజన్ 99.99 పర్సంటైల్ సాధించి తొలి ర్యాంక్ పొందినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) వెల్లడించింది.

తెలంగాణకు చెందిన కెజి రఘురాం రెడ్డి జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు సాధించాడు. నీట్ కు అర్హత సాధించిన వారిలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్ ల నుంచి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఉన్నారు. ఈ ఏడాది నీట్ కు దేశవ్యాప్తంగా మొత్తం 11లక్షల 45వేల 976 మంది అర్హత సాధించగా.. ఏపీ నుంచి 42వేల 836 మంది.. తెలంగాణ నుంచి 42వేల 654 మంది అభ్యర్థులు ఉన్నారు.

Also Read..Cyber Criminals : సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి.. రూ. కోటిన్నర పోగొట్టుకున్న మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్

వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం భారత్ తో పాటు విదేశాల్లోని పలు నగరాల్లో 4079 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 20లక్షల 87వేల 449 మంది విద్యార్థులు హాజరయ్యారు. జూన్ 4న ప్రిలిమినరీ ఆన్సర్ కీ ని విడుదల చేసిన ఎన్ టీ ఏ.. దీనిపై జూన్ 6వరకు విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించింది. వాటిని పరిగణలోకి తీసుకున్న ఎన్టీఏ అధికారులు తుది ఆన్సర్ కీతో పాటు ఫలితాలను విడుదల చేశారు.

Also Read..Amit Shah in South: అమిత్‌షా ఏమన్నారో విన్నారా.. సౌత్‌లో బీజేపీకి 80 ఎంపీ సీట్లు సాధ్యమేనా?

నీట్ ఫలితాలు విడుదల..
* ఓబీసీ కేటగిరీలో ఏపీ విద్యార్థి బి.వరుణ్ చక్రవర్తికి మొదటి ర్యాంకు
* ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఏపీ విద్యార్థి వైఎల్ ప్రవధాన్‌ రెడ్డికి తొలి ర్యాంకు
* ఎస్సీ కేటగిరీలో ఏపీ విద్యార్థి కె.యశశ్రీకి రెండో ర్యాంకు
* నీట్‌లో దేశవ్యాప్తంగా అర్హత సాధించిన 11,45,976 మంది విద్యార్థులు

ట్రెండింగ్ వార్తలు