Viral News : ఈ పానీపూరి వ్యాపారి రోజువారి ఆదాయం ఎంతో తెలిస్తే షాకవుతారు

పానీపూరి వ్యాపారం చేస్తే ఏం ఆదాయం ఉంటుంది? అనుకునేరు. ఎంత లాభం వస్తుందో ఓ వీధి వ్యాపారి చెప్పిన మాటలు వింటే షాకవుతారు.

Viral News

Viral News : గోల్గప్పా.. పుచ్కా.. బటాషే.. పానీపూరి .. ప్రాంతాన్ని బట్టి ఏ పేరుతో పిలిచినా పానీపూరికి మాత్రం విపరీతంగా అభిమానులు ఉంటారు. అనేక చోట్ల వీధి వ్యాపారులు వీటిని విక్రయిస్తుంటారు. వీటిని అమ్మితే ఏం లాభం ఉంటుంది? అనుకునే వారికి ఓ షాకింగ్ న్యూస్. పానీపూరీలు విక్రయించే ఓ వ్యాపారి రోజువారి ఆదాయం తెలిసి ఇంటర్నెట్ షాకైంది.

Volcano Pani Puri : అగ్నిపర్వతం పానీపూరి .. చూస్తే .. లొట్టలేయకుండగా ఉండలేరు..

చదువుకి చేసే పనికి ఒక్కోసారి సంబంధం ఉండదు. ఇటీవల కాలంలో పెద్ద చదువులు చదువుకుని, చేసే మంచి ఉద్యోగాలు వదిలిపెట్టి రోడ్ సైడ్ వ్యాపారాలు చేస్తున్న వ్యక్తుల వీడియోలు ఇంటర్నెట్‌లో చూస్తున్నాం. అలాగే ఓ పానీపూరి వ్యాపారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. vijay_vox_ and college_arena_ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి షేర్ చేసిన వీడియోలో ఓ పానీపూరి వ్యాపారిని ‘నీ డెయిలీ శాలరీ తెలుసుకోవచ్చా?’ అని అడగటం వినిపిస్తుంది. ఆ వ్యాపారి రూ.2,500 అని చెబుతాడు. ‘డెయిలీ శాలరీనా?’ అని అడిగితే అవును అని చెప్పడం షాక్‌కి గురి చేసింది. దీనిని నెలసరి వేతనంగా లెక్కిస్తే అక్షరాల రూ.75,000 అన్నమాట.

Different names for pani puri : మీరెంతగానో ఇష్టపడే పానీ పూరీకి ఎన్ని పేర్లున్నాయో తెలుసా?

ఈ పానీపూరి వ్యాపారి ఆదాయంపై ఇంటర్నెట్‌లో చర్చ మొదలైంది. అతని ఆదాయం ప్రైవేట్ కంపెనీల్లో ఎంట్రీ లెవెల్, మిడ్ లెవెల్ ఉద్యోగుల నెలసరి వేతనాలతో పోలిస్తే ఎక్కువ అంటూ మాట్లాడారు. కొందరు MBA చదవడం అనవసరం అంటూ కూడా కామెంట్ చేశారు. ఒక్కసారిగా వైరల్ అయిన వీడియోకు 4 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారాల కన్నా పానీపూరీ వంటి వీధి వ్యాపారం లాభదాయకంగా ఉందని చాలామంది భావించారు.