Different names for pani puri : మీరెంతగానో ఇష్టపడే పానీ పూరీకి ఎన్ని పేర్లున్నాయో తెలుసా?

పానీ పూరీ అందరికీ ఇష్టమైన ఫేమస్ స్ట్రీట్ ఫుడ్. పానీ పూరీకి దేశ వ్యాప్తంగా ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా?

Different names for pani puri : మీరెంతగానో ఇష్టపడే పానీ పూరీకి ఎన్ని పేర్లున్నాయో తెలుసా?

different names for pani puri

Different names for pani puri : పానీ పూరీ.. ఇండియాలో ఆల్ టైమ్ ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్. వీటిని తయారు చేసే విధానంలో చిన్న మార్పులు ఉన్నా దేశంలో చాలా ప్రాంతాల్లో పానీ పూరీని రకరకాల పేర్లతో పిలుస్తారు. అత్యధిక ప్రజాదరణ పొందిన పానీ పూరీకి ఉన్న పేర్లేంటో చదవండి.

Origin of Pani Puri : మహాభారత కాలంలో పానీ పూరి.. ద్రౌపది కనిపెట్టిందట

పానీ పూరీని ఢిల్లీ, పంజాబ్, జమ్ము అండ్ కాశ్మీర్, హర్యానా, మధ్యప్రదేశ్‌లలో గోల్ గప్పే అంటారు. ఆలూ, చిక్‌పీ, చట్నీతో కలిపి తయారు చేస్తారు. చిక్కగా కలిపిన నీటిలో ముంచి వీటిని అందిస్తారు. పూరీలు అడిషనల్ క్రంచ్‌ను కలిగి ఉంటాయి. ఇంకా ఇంకా తినాలి అనిపిస్తాయి. బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాలలో పానీ పూరీని పుచ్కా అంటారు. ఉడకబెట్టిన మెత్తని ఆలూ మిశ్రమంతో ఒక పుచ్కా తయారు చేస్తారు. చట్నీ కూడా మెత్తగా ఉంటుంది. నీటి చాలా స్పైసీగా కలుపుతారు. నార్మల్ పూరీలా కాకుండా పూరీ కాస్త పెద్దగా ఉంటుంది. ఈ పూరీని గోధుమ పిండితో తయారు చేస్తారు.

గుజరాత్, మధ్యప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, నేపాల్‌లలో పానీ పూరీ అనే పిలుస్తారు. చింతపండు చట్నీ, ఆలూ, చిక్‌పీ, చాట్ మసాలాతో తీపి, కారం రుచితో ఉండే నీటిలో గుండ్రని పూరీని ముంచి ఇస్తారు. ముంబయిలో రగ్దా (మెత్తని తెల్లని బీన్స్) తీపి చింతపండు చట్నీతో పానీ పూరీని నింపి ఇస్తారు. గుజరాత్, మధ్యప్రదేశ్ లలో పానీ పూరీని పకోడీ అని కూడా పిలుస్తారు. దీనికి నార్మల్‌గా మనం తయారు చేసుకునే పకోడీకి సంబంధం లేదు. పచ్చి మిరపకాయలు, పుదీనా పేస్ట్‌ను నీటిలో కలుపుతారు. కొన్ని ప్రాంతాల్లో సేవ్ కూడా యాడ్ చేస్తారు.

Volcano Pani Puri : అగ్నిపర్వతం పానీపూరి .. చూస్తే .. లొట్టలేయకుండగా ఉండలేరు..

ఒడిశా, బీహార్ లోని కొన్ని ప్రాంతాలు, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, హైదరాబాద్, తెలంగాణలో పానీ పూరీని గప్ చుప్ అంటారు. తెల్ల బఠానీలు, లేదా చిక్‌పీలను స్పైసీ వాటర్, ఉడికించిన ఆలూతో పాటు సగ్గుబియ్యంలో కలుపుతారు. ఉత్తరప్రదేశ్‌లో వీటిని పానీకే పటాషే అని పిలుస్తారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లలోని కొన్ని ప్రాంతాల్లో పానీకే పటాషీ అని, ఉత్తరప్రదేశ్ అలీ ఘర్‌లో పడ్కా అని పిలుస్తారు. మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ లో పానీ పూరీని టిక్కీ అంటారు. సాధారణంగా తినే టిక్కీకి దీనితో సంబంధం లేదు. ఈ టిక్కీల పూరీలు చిన్నవిగా ఉంటాయి. ఇలా అందరూ ఎంతో ఇష్టంగా తినే పానీ పూరీల సైజ్‌లలో, వాటికోసం తయారు చేసే మసాలాలో అటు ఇటుగా కాస్త తేడాలున్నాయి. పిలిచే పేర్లలో కూడా వేరుగా ఉన్నాయి.