Origin of Pani Puri : మహాభారత కాలంలో పానీ పూరి.. ద్రౌపది కనిపెట్టిందట

ఏదైనా ఫుడ్ తింటున్నప్పుడు ఎప్పుడైనా దాని చరిత్ర తెలుసుకోవాలని ప్రయత్నం చేశారా? అసలు పానీ పూరిని మొదటగా ఎవరు కనిపెట్టారో తెలుసా? అందరూ ఎంతగానో ఇష్టపడే పానీ పూరి సృష్టించింది ఎవరంటే?

Origin of Pani Puri : మహాభారత కాలంలో పానీ పూరి.. ద్రౌపది కనిపెట్టిందట

Origin of Pani Puri

Origin of Pani Puri : పానీ పూరి అంటే ఇష్టం లేని వారు ఉండరు. ఇండియాలో చాలా ఫేమస్ అయినా ఈ స్ట్రీట్ ఫుడ్‌ను గోధుమ పిండితో చేసిన క్రిస్పీ బాల్స్‌లో ఆలూ, బఠానీలు, మసాల నింపిన నీటిలో ముంచి తింటారు. దీనిని పుచ్చా, గోల్ గప్పా, గప్ చుప్ అని కూడా అంటారు. పేరు చెప్పగానే నోరూరించే పానీ పూరి ఇప్పటిది కాదట.. మహాభారత కాలంలోనే ఉందట. అప్పుడు ఎవరు కనిపెట్టారు అనేగా మీ డౌట్?

Volcano Pani Puri : అగ్నిపర్వతం పానీపూరి .. చూస్తే .. లొట్టలేయకుండగా ఉండలేరు..

పానీ పూరి ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్. అందరూ ఇష్టంగా తింటారు కానీ.. ఎప్పుడైనా దీని చరిత్ర తెలుసుకోవాలని ట్రై చేసి ఉండకపోవచ్చు. అసలు ఈ పానీ పూరి ఎవరు కనిపెట్టారు? మొదట ఎవరు తయారు చేశారు? అంటే ఇంట్రెస్టింగ్ కథ వినిపిస్తోంది. పానీ పూరి మహాభారత కాలంతో ముడిపడి ఉందని తెలుస్తోంది. ద్రౌపదికి పాండవులతో వివాహమైన కొత్తలో ఈ ఫేమస్ చిరుతిండిని సృష్టించిందని నమ్ముతారు. ఆమె అత్తగారు కుంతీదేవి మిగిలిపోయిన ఆలూ సబ్జీ, గోధుమ పిండిని ఉపయోగించి ఏదైనా కొత్త వంటకం సృష్టించి భర్తల దగ్గర మెప్పు పొందాల్సిందిగా సవాల్ విసిరిందట.

Gastroenteritis: వర్షాల్లో పొట్ట భద్రం.. పానీపూరీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!

ఇక ద్రౌపది తన టాలెంట్ అంతా ఉపయోగించి చిన్న సైజు పూరీలను తయారు చేసిందని.. అవే పానీ పూరిలని చెబుతారు. ఎంతో ఆకలితో ఉన్న భర్తలు.. అత్తగారు వాటిని తిని మెచ్చుకున్నారని అంటారు..అదీ విషయం. అంటే అప్పట్నుంచి ఈ పానీ పూరిలో ప్రజలకు పరిచయం అయ్యాయన్నమాట. పానీ పూరికే ఇంత కథ ఉంటే మనం తినే ఎన్నో రకాల ఫుడ్‌ల వెనుకాల కూడా చరిత్ర దాగి ఉండొచ్చు.