Gastroenteritis: వర్షాల్లో పొట్ట భద్రం.. పానీపూరీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!

గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే జీర్ణ వ్యవస్థలో ఇన్ ఫెక్షన్ వచ్చి ఇన్ ఫ్లమేషన్ కావడం. కలుషితమైన ఆహారం గానీ, నీరు గాని తీసుకున్నప్పుడు 12 నుంచి 24 గంటలలోపు వాటి ప్రభావం మన జీర్ణ వ్యవస్థ పైన కనిపిస్తుంది.

Gastroenteritis: వర్షాల్లో పొట్ట భద్రం.. పానీపూరీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!

Gastroenteritis

Gastroenteritis: వర్షాల్లో మిరపకాయ బజ్జీలమీదకి మనసు వెళ్లని వాళ్లు ఉండరు. పానీపూరీ(Panipuri) కనిపించగానే ఒక్క ప్లేట్ అయినా తినకుండా వెళ్లలేం. కానీ ఈ వర్షాల్లో ఇలా బయటి ఆహారం తీసుకుంటే.. ఇక మీ పొట్ట పని గోవిందానే. వర్షాకాలంలో కడుపులో ఇన్ ఫెక్షన్లు చాలా కామన్. పొట్ట భద్రంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలంటే..

సీజన్ మారుతున్నదంటే సాధారణంగా ఇన్ ఫెక్షన్ల అవకాశం ఎక్కువగా ఉంటుంది. అకస్మాత్తుగా మారే ఉష్ణోగ్రతలు మన ఇమ్యూనిటీ (Immunity) పైన కూడా ప్రభావం చూపుతాయంటారు డాక్టర్లు. అలాంటిది.. ఎండాకాలం వెళ్లి వర్షాలు పడటం మొదలైతే.. ఇక ఇన్ ఫెక్షన్ల కాలం స్టార్ట్ అయినట్టే.

ఉష్ణోగ్రతలు సడెన్ గా మారితే…
ఈ వర్షాకాలంలో అతి సామాన్యంగా కనిపించేవి కడుపులో ఇన్ ఫెక్షన్లు. ముఖ్యంగా పిల్లల్లో కడుపు నొప్పి, వాంతులు, విరేచనాల వంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇలా కడుపులో వచ్చే సమస్యనే గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటాం. దీనికి చిన్నా పెద్దా తేడా లేదు. ఏ వయసు వారిలో అయినా రావచ్చు. పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి కాస్త తక్కువగా ఉండటం వల్ల వాళ్లు చాలా సులువుగా ఇన్ ఫెక్ట్ అవుతుంటారు.

ఇప్పుడు పొద్దంతా ఎండ కొట్టి, సాయంత్రం అయ్యే సరికల్లా వర్షం పడుతున్నది. ఇలా సడెన్ గా ఉష్ణోగ్రతలో వచ్చే ఫ్లక్చువేషన్లు కూడా శరీరంలోని వ్యాధినిరోధక వ్యవస్థను గందరగోళంలో పడేస్తాయి. అందుకే ఇలాంటి వాతావరణంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

గ్యాస్ట్రోఎంటరైటిస్
గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే జీర్ణ వ్యవస్థలో ఇన్ ఫెక్షన్ వచ్చి ఇన్ ఫ్లమేషన్ కావడం. కలుషితమైన ఆహారం గానీ, నీరు గాని తీసుకున్నప్పుడు 12 నుంచి 24 గంటలలోపు వాటి ప్రభావం మన జీర్ణ వ్యవస్థ పైన కనిపిస్తుంది. వర్షాలు పడ్డాయంటే చాలు.. ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజీ లీక్ అవడం చూస్తుంటాం. ఈ మురికి నీరు, మంచి నీటిలో కలిసే అవకాశాలు వర్షాల్లో ఎక్కువ. అందుకే వర్షాకాలంలో ఇన్ ఫెక్షన్ల అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే బయటి తిండి తినేవాళ్లకు ఇలాంటి ఇన్ ఫెక్షన్లు ఎక్కువ. బయట అమ్మే ఆహార, పానీయాలు కలుషితమయ్యేందుకు ఆస్కారం ఉంటుంది.వాటిని తీసుకున్నప్పుడు గ్యాస్ట్రోఎంటరైటిస్ లాంటి జీర్ణకోశ ఇన్ ఫెక్షన్లు సర్వసాధారణం. గ్యాస్ట్రయిటిస్ (Gastritis) కూడా వర్షాకాలంలో ఎక్కువే.

Also Read: తేనె రాస్తే జుట్టు తెల్లబడుతుందా.. ఇందులో నిజమెంత?

ఈ లక్షణాలుంటే జాగ్రత్త
వాంతులు గానీ, విరేచనాలు గానీ, లేదా సడెన్ గా మలబద్ధకం గానీ మొదలైతే.. కడుపులో ఇన్ ఫెక్షన్ ఉందని అనుమానించాల్సిందే. ఎందుకంటే, జీర్ణ కోశ ఇన్ ఫెక్షన్లకు సంబంధించిన ఏ సమస్య అయినా మొదట వాంతులు, విరేచనాలతోనే బయటపడుతుంది. ఇలాంటప్పుడు కడుపు నొప్పి కూడా ఉంటుంది. కొన్నిసార్లు వాంతి లేదా విరేచనంతో పాటు రక్తం కూడా కనిపించొచ్చు. గ్యాస్ట్రోఎంటరైటిస్ అక్యూట్ గా కనిపిస్తుంది కాబట్టి సడెన్ గా లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ ను కలిస్తే సకాలంలో చికిత్స తీసుకోవచ్చు.

Also Read: మీరు అబద్ధం చెబితే మీ ముక్కు చెప్పేస్తుంది.. ఎలాగో తెలుసా!

కొన్నిసార్లు గ్యాస్ట్రోఎంటరైటిస్ వల్ల ఇతరత్రా కాంప్లికేషన్లు కూడా రావచ్చు. డీహైడ్రేట్ అయ్యి ప్రాణాపాయం కూడా ఏర్పడొచ్చు. కొందరు అన్ కాన్షియస్ అయిపోతారు. ఇలాంటప్పుడు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. రెండు మూడు విరేచనాల కన్నా ఎక్కువ అయినా, ఒకటే విరేచనం అయినప్పటికీ రక్తం పడితే వెంటనే డాక్టర్ ను కలవాలి. స్పృహ తప్పినా, కడుపు నొప్పి, ఛాతినొప్పి, నొప్పి కడుపు నుంచి వెన్ను భాగం వైపుకి వెళ్లినా వెంటనే అత్యవసర చికిత్స అవసరం.

Also Read: కితకితలు పెడితే నవ్వు ఎందుకు వస్తుందో తెలుసా?

కడుపులో ఇన్ ఫెక్షన్లు నివారించాలంటే…
ఈ వర్షాకాలంలో బయటి ఫుడ్ ఎంత అవాయిడ్ చేస్తే మీ కడుపు అంత పదిలంగా ఉంటుంది. ఇంట్లో తయారుచేసిన ఫుడ్ గానీ, డ్రింక్స్ గానీ మాత్రమే తీసుకోవాలి. మంచినీళ్లు కూడా బయటివి తాగకపోవడం మంచిది. ఎక్కడికి వెళ్లినా వాటర్ బ్యాటిల్ క్యారీ చేయండి. ఇంట్లో కూడా సాధారణ నీటికి బదులుగా వాటిని కాచి, చల్లార్చి తాగాలి. ఫ్రిజ్ లో నిలవ చేయకుండా ఎప్పటిదప్పుడు వండుకుని వేడిగా తినాలి. బండి మీద అమ్మే ఫుడ్స్
జోలికి వెళ్లొద్దు. పానీపూరీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అంతగా కావాలనుకుంటే ఇంట్లోనే తయారు చేసుకుని తినండి.