Volcano Pani Puri : అగ్నిపర్వతం పానీపూరి .. చూస్తే .. లొట్టలేయకుండగా ఉండలేరు..

భగ భగ మండే అగ్నిపర్వతాన్ని చూసి ఉంటారు.దాని దగ్గరకు వెళ్లాలంటే వేడి వేడి సెగలు పుట్టిస్తుంది. కానీ సూరత్ లో అగ్నిపర్వతం లొట్టలేయేయిస్తుంది. వావ్ ఏమి రుచి అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు నోట్లో పెట్టుకుని గుటుక్కుమనిపిద్దామా అనిపిస్తుంది. ఆ టేస్టీ టేస్టీ వాల్కెనో ఏంటో ఈ వీడియోలో చూసేయండి..

Volcano Pani Puri : అగ్నిపర్వతం పానీపూరి .. చూస్తే .. లొట్టలేయకుండగా ఉండలేరు..

Volcano Pani Puri : సూరత్ లో ఓ వ్యక్తి విక్రయించే పానీపూరీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ పానీ పూరి పేరు వాల్కనో పానీపూరి. ఈ గోల్గప్పా బండిపేరు ‘ఆయుష్ పానీపూరి సెంటర్’. ఈ పానీపూరి అగ్నిపర్వతం పానీ పూరీ(Volcano Pani Puri )గా ఫుల్ ఫేమస్.

ఉద్నా ఉద్యోగ్ నగర్ లో ఆయుష్ పానీ పూరి సెంటర్ ఫుట్ ట్రెండ్ అవుతోంది. అతను తయారు చేసే వాల్కనో పానీ పూరికి ఫుల్ డిమాండ్ ఉంది. జనాలు ఎంతో ఇష్టంగా ఈ వాల్కెనో పానీ పూరి తింటారు.సాధారణంగా పానీ పూరి బండ్లవారు..పానీపూరీలో వాడే మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసి కస్టమర్లు వచ్చినప్పుడు పూరీలో ఈమిశ్రమంతో తయారు చేసినదాన్ని పెట్టి దాంట్లో పానీ పోసి ఇస్తారు. ఈ మిశ్రమాన్ని బంగాళదుంప, బఠాళీలు వంటివాటితో తయారు చేస్తారు.

కానీ సూరత్ లో ఈ వాల్కెనో పానీ పూరీ ప్రత్యేక ఏమంటంటే ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని ఓ పేద్ద అగ్నిపర్వతంలో తయారు చేసి దాని మధ్యలో ఓ గుంట పెట్టి దాంట్లో పానీ పూరీలో వినియోగించే పానీని పోసి బాగా మదిస్తాడు. ఆ తరువాత బుల్లి బుల్లి పూరీలో ఈ ఈ మిశ్రమాన్ని పెట్టి పానీని పోసి కస్టమర్లకు అందిస్తాడు. అదిన్నమాట అగ్నిపర్వతం పానీ పూరీ స్పెషల్. చక్కగా ఆ అగ్నిపర్వతానికి కొత్తిమీరతో భలే డెకరేట్ చేసి కలర్ ఫుల్ గా తయారు చేశాడు. ఇక పూరీలో పోసే పానీని సుగంధ ద్రవ్యాలతో తయారు చేసి విక్రయిస్తున్నాడు. పూరీపానీలో నల్లమిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలు వినియోగిస్తారు.

అచ్చంగా అగ్నిపర్వంలాగా మిశ్రమాన్ని తయారు చేసి దాంట్లో లావాలాగా పానీని పోసి వెరైటీ స్టైల్లో తన వ్యాపారానికి గిరాకీ పెంచుకున్నాడు. ఈరోజుల్లో క్రియేటివిటీని కష్టమర్లు బాగా ఇష్టపడుతున్నారు. దానికి తగినట్లే వ్యాపారులు కూడా కొత్త కొత్త రీతిల్లో కష్టమర్లను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాల్లో వైరల్ అవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Amar Sirohi (@foodie_incarnate)