GST Rate Cement cut
GST Rate on Cement cut: సొంతిల్లు కట్టుకోవాలని లేదంటే నిర్మాణం చేసిన ఇంటినో, అపార్టుమెంట్‌లో ఓ ప్లాట్‌నో కొనుక్కోవాలని ప్రతిఒక్కరూ ఆశపడుతుంటారు. కానీ గత కొంతకాలం నుంచి ఈ పరిస్థితులు తారుమారవుతున్నాయి. ఇంటి నిర్మాణంకు సంబంధించి అన్ని వస్తువుల ధరలు పెరగడంతో ఇంటి నిర్మాణం, కొనుగోలు మధ్య తరగతి వర్గాల ప్రజలకు భారంగా మారుతోంది. అయితే, తాజాగా నిర్మాణ రంగానికి బూస్టింగ్ ఇచ్చేలా కేంద్రం కీలక నిర్ణయం ప్రకటించింది.
Also Read: New GST bikes Prices : కొత్త GST రేట్ల ఎఫెక్ట్.. ఏయే బైక్ ధరలు తగ్గుతాయి.. ఏయేవి పెరుగుతాయి?
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ శ్లాబుల్లో మార్పులు చేసింది. దీంతో నిర్మాణ రంగానికి ఊతమిచ్చేలా సిమెంట్ ధరలు భారీగా తగ్గనున్నాయి. ఇప్పటి వరకు 28శాతం శ్లాబులో ఉన్న సిమెంట్.. ప్రస్తుతం 18శాతం శ్లాబులోకి వచ్చింది. దీంతో సిమెంట్ బస్తా ధర దాదాపు రూ.30 తగ్గనుంది. ఇక రెయిన్ సీజన్ కావడంతో సిమెంట్ ధరను మరింత తగ్గించేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. కంపెనీలు ధర తగ్గింపుతోపాటు జీఎస్టీ ఎఫెక్ట్‌తో మొత్తంగా సిమెంట్ బస్తా ధర రూ.50 మేర తగ్గే అవకాశాలు ఉన్నాయి.
సిమెంట్ ధర భారీగా తగ్గనున్న నేపథ్యంలో త్వరలో నిర్మాణాల ధరలు కూడా దిగొచ్చే అవకాశం ఉందని ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. స్టీల్ ధరపై కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టి రేట్లు తగ్గిస్తే నిర్మాణ రంగం మళ్లీ పరుగులు పెడుతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
సుచిరిండియా సీఈఓ లయన్ కిరణ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయం రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి ఊపునిచ్చే అవకాశం ఉందని అన్నారు. సిమెంట్ ను 28శాతం స్లాబ్ నుంచి 18శాతం స్లాబులోకి తీసుకురావడం వల్ల అపార్టుమెంట్లు నిర్మాణం చేసేవారి దగ్గర నుంచి గ్రామాల్లో ఇంటి నిర్మాణం చేసుకునే వారి వరకు మేలు చేస్తుందని చెప్పారు. ప్రస్తుతం కేంద్రం నిర్ణయంతో సిమెంట్ బస్తాపై రూ.30 తగ్గే అవకాశం ఉంది. దీంతో నిర్మాణ దారుడు క్వాలిటీ సిమెంట్ ను వినియోగించేందుకు ఆస్కారమూ ఉంటుంది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం దేశవ్యాప్తంగా నెమ్మదించింది. కేంద్ర తాజా నిర్ణయంతో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే అవకాశం ఉంటుంది. అయితే, కొంతకాలం తరువాత అయిన 18శాతం శ్లాబు నుంచి 12శాతం, అంతకంటే తక్కువ శాతం స్లాబులోకి సిమెంట్ ను తీసుకురావాల్సిన అవసరం ఉందని సుచిరిండియా సీఈఓ అన్నారు. సిమెంట్‌తోపాటు ఐరన్, ఇంటి నిర్మాణంకు వినియోగించే ఇతర వస్తువుల ధరలనుసైతం తగ్గిస్తే మధ్యతరగతి ప్రజలకు కూడా ఇంటి ధరలు అందుబాటులోకి వచ్చి.. రియల్ ఎస్టేట్ వ్యాపారం మరింత పుంజుకుంటుందని చెప్పారు.