New Parliament Inauguration: నూతన పార్లమెంట్ భవన నిర్మాణంలో ఏ రాష్ట్రం నుంచి ఏ వస్తువును వినియోగించారో తెలుసా?

కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి వివిధ ప్రాంతాల నుంచి మెటీరియల్ తెప్పించి వినియోగించారు. స్టోన్‌వర్క్‌కు సంబంధించి అంతా రాజస్థాన్‌లో చేయించారు.

Parliament building: నూతన పార్లమెంట్ భవనంలో ఆధునిక సదుపాయాలు కల్పించారు. లోక్‌సభ, రాజ్యసభ, రాజ్యాంగ హాలుల నిర్మాణం చేశారు. నూతన భవనం అతితీవ్ర భూకంపాలను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంది. 150ఏళ్ల వరకు నిలిచి ఉండేలా ఈ భవన నిర్మాణం చేపట్టారు. భూగర్భంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో కార్యాలయాలు నిర్మించారు. ఈ నూతన పార్లమెంట్ భవనాన్ని డిజిటల్ పార్లమెంట్ అనికూడా చెప్పొచ్చు. ఎందుకంటే.. ఉభయ సభల్లో అధునాతన సదుపాయాలు కల్పించారు. సభ్యుడి సీటు వద్దే సకల సదుపాయాలతో పాటు సభ్యుల సీట్లలో బయోమెట్రిక్ పరికరాలు, అనువాదం కోసం డిజిటల్ డివైజ్‌లు, ప్రతీ సీటు వద్ద మల్టీ మీడియా డిస్ ప్లే సదుపాయం ఉంది. అంతేకాక, మీడియాకోసం ప్రత్యేకంగా సీట్లు ఏర్పాట్లు చేశారు.

New Parliament Inauguration: కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ.. భవన నిర్మాణ కార్మికులకు సన్మానం

లోక్‌సభను జాతీయ పక్షి నెమలి థీమ్‌తో నిర్మాణం చేశారు. నెమలి ఆకారంలో ఛాంబర్ డిజైన్ ఉంటుంది. పాత భవనంతో పోలిస్తే మూడు రెట్లు అధిక సీట్లు అందుబాటులోకి తెచ్చారు. 888 మంది సభ్యుల కోసం సీట్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా రాజ్యసభను తామర పువ్వు థీమ్‌తో నిర్మాణం చేశారు. ఇందులో 384 మంది ఎంపీలు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. సభ్యుల కోసం రెండు సభల్లోనూ భారీ తెరలు ఏర్పాటు చేశారు. సంయుక్త సమావేశాల్లో 1,272 మంది కూర్చునే వీలుంటుంది.

New Parliament Inauguration: నూతన పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ.. మొదలైన పూజా కార్యక్రమాలు

ఏ రాష్ట్రం నుంచి ఏం తెప్పించారంటే..

కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి వివిధ ప్రాంతాల నుంచి మెటీరియల్ తెప్పించి వినియోగించారు. స్టోన్‌వర్క్‌కు సంబంధించి అంతా రాజస్థాన్‌లో చేయించారు.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి టేకు కలప.
యూపీలోని మీర్జాపూర్ నుంచి కార్పెట్లు.
త్రిపుర నుంచి ఫ్లోరింగ్ కు కావాల్సిన వెదురు.
రాజస్థాన్ నుంచి రాతి శిలలు.
మహారాష్ట్ర నుంచి ఎరుపు, తెలుపు ఇసుకరాయి.
ఔరంగాబాద్, జైపూర్ నుంచి అశోక చిహ్నం.
మధ్యప్రదేశ్ ఇండోర్ నుంచి అశోక చక్రం.
ముంబై నుంచి ఫర్నీచర్ కొనుగోలు.
జైసల్మేర్ నుంచి ఎరుపు రంగు మార్బుల్స్.
రాజస్థాన్ నుంచి అంబాజీ వైట్ మార్బుల్స్.
ఉదయ్‌పూర్ నుంచి కేశారియా గ్రీన్ స్టోన్.
హర్యానా, యూపీ నుంచి ఫ్లైయాష్ బ్రిక్స్
అహ్మదాబాద్ నుంచి ఇత్తడి, ప్రీ కాస్ట్ ట్రెంచ్
డామన్ అండ్ డయ్యూ నుంచి స్టీల్ ఫాల్ సీలింగ్

ట్రెండింగ్ వార్తలు