మీ కారు, బైక్‌ పాతవా? మీకో షాకింగ్‌ న్యూస్‌.. కేంద్రం సంచలనం.. మీ జేబుకి చిల్లు..

ఇప్పటివరకు వాహనం కొని 20 ఏళ్లు దాటితే ఐదేళ్లకు ఓసారి రెన్యూవల్‌ చేసుకోవాల్సి వచ్చేది.

మీ కారు, బైక్‌ చాలా పాతవా? మీ వాహనం కొని 20 ఏళ్లు దాటిందా? ఇటువంటి వాహనాల రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌(ఆర్సీ) రెన్యూవల్‌ రుసుమును పెంచనున్నారు. ఈ మేరకు కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే దీని ముసాయిదాను కేంద్ర సర్కారు విడుదల చేసింది. దీనికి ఆమోదం తెలిపితే బైక్‌ల రెన్యూవల్‌కు సంవత్సరానికి రూ.2,000, కార్లకు రూ.10,000 చార్జీ పడుతుంది. ఇప్పటివరకు వాహనం కొని 20 ఏళ్లు దాటితే ఐదేళ్లకు ఓసారి రెన్యూవల్‌ చేసుకోవాల్సి వచ్చేది.

Also Read: యూజీసీ నెట్‌ ఫలితాలు విడుదల.. కట్ ఆఫ్ పీడీఎఫ్‌ని ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

కానీ, కేంద్ర సర్కారు తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ఇకపై ప్రతి ఏడాది వాహనాన్ని రవాణాశాఖ కార్యాలయానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీ వాహనం ఫిట్‌నెస్‌ పరీక్షలో పాస్ అయితేనే దాన్ని రెన్యూవల్‌ చేస్తారు.

అంతేకాదు, ఆటో రిక్షాలతో పాటు ఇతర వెహికిల్స్ రెన్యూవల్‌ చార్జీలు సైతం సుమారు రెండురెట్లు పెరుగుతాయి. ఇప్పటివరకు 15 సంవత్సరాలు దాటిన బైక్‌ అయితే ఐదేళ్ల రెన్యూవల్‌కు రూ.2,000 తీసుకునేవారు.

అలాగే, 20 ఏళ్లు దాటితే ఐదేళ్లకు రూ.5,000గా చార్జీ ఉంది. అలాగే, కార్ల విషయంలో 15 ఏళ్లు దాటితే ఐదేళ్ల రెన్యూవల్‌కు రూ.5,000, 20 ఏళ్లు దాటితే రూ.10,000గా ఉంది. ఇవే భారీగా పెరగనున్నాయి. ప్రతి ఏడాది రెన్యూవల్ చేసుకునే విధంగా నిబంధనల్లో మార్పులు చేయనున్నారు.