UGC NET Results: యూజీసీ నెట్ ఫలితాలు విడుదల.. కట్ ఆఫ్ పీడీఎఫ్‌ని ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
ugcnet.nta.ac.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) యూజీసీ -నెట్ డిసెంబర్ 2024 ఫలితాలను విడుదల చేసింది. కట్-ఆఫ్‌ను ప్రకటించింది. డిసెంబర్ సెషన్ పరీక్ష జనవరి 3 నుంచి జనవరి 27 వరకు జరిగింది.
జూనియర్ రీసెర్చి ఫెలోషిప్‌తో పాటు యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దీని ద్వారా అర్హత పొందవచ్చు. ఈ పరీక్షకు సంబంధించిన ఇటీవల ప్రాథమిక కీ విడుదలైంది. ugcnet.nta.ac.in లో ఫలితాలు చూసుకోవచ్చు.
Also Read: హృదయాన్ని ద్రవింపజేస్తున్న వీడియో.. ఈ కుక్క ఎంత ప్రేమను కురిపించిందో చూడండి..
అలాగే, ఫిబ్రవరి 3వరకు అభ్యంతరాలు స్వీకరించింది. ఈ ఫలితాలను ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఈ పరీక్షకు మొత్తం 8.49 లక్షల మంది దరఖాస్తు చేసుకుని, 6.49 లక్షల మంది రాశారు.
జేఆర్‌ఎఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం మొత్తం 5,158 మంది అర్హత సాధించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, పీహెచ్‌డీలో ప్రవేశాల కోసం 48,161 మంది అర్హత సాధించారు. అలాగే, ఈ రెండింటిలో కాకుండా పీహెచ్‌డీల్లో మాత్రమే ప్రవేశాల కోసం 1,14,445 మంది క్వాలిఫై అయ్యారు.
కట్ ఆఫ్ పీడీఎఫ్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
- ugcnet.nta.ac.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి
- UGC NET కట్-ఆఫ్ లింక్‌పై క్లిక్ చేయండి.
- UGC NET కట్-ఆఫ్ 2025 PDF స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- PDF ని డౌన్‌లోడ్ చేసి సేవ్ చేయండి.
డైరెక్ట్ లింక్
https://ugcnet.nta.ac.in/images/cutoff-dec24wsqwer231y2025.pdf
స్కోర్ కార్డు కోసం
https://ugcnetdec2024.ntaonline.in/scorecard/index