Viral Video: హృదయాన్ని ద్రవింపజేస్తున్న వీడియో.. ఈ కుక్క ఎంత ప్రేమను కురిపించిందో చూడండి..
ఈ వీడియోకు కొన్ని మిలియన్లకొద్దీ వ్యూస్ వచ్చాయి.

Viral Video
మనుషులకు, శుననాలకు మధ్య ఉండే అనుబంధం చాలా ప్రత్యేకమైనది. మనుషులకు కుక్కలు విశ్వాసపాత్రమైన జంతువులుగా ఉంటున్నాయి. మనం కాస్త ప్రేమను చూపిస్తే చాలు.. మనల్ని కుక్కలు ఎంతో ఆదరిస్తాయి.
మనుషులతో కుక్కలు ఎంతో స్నేహపూర్వకంగా ఉంటాయి. మనుషుల్లోనే కాదు కుక్కల్లోనూ ప్రేమాభిమానాలు ఉంటాయి. మనుషులపై కుక్కలు చూపించే ప్రేమాభిమానాలు ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి.
అంతలా ప్రేమాభిమానాలు కురిపించే కుక్కలను మనకు వదులుకోవాలనిపించదు. తాజాగా, ఓ జర్నలిస్టుపై కుక్క ఎంతో ప్రేమాభిమానాలను కురిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఒక కుక్క ఓ జర్నలిస్ట్ చేతిని చాలా గట్టిగా పట్టుకుంది. అతడు దాని వద్ద నుంచి వెళ్లిపోవాలని చూస్తే వెళ్లనివ్వలేదు. షెల్టర్ హోమ్‌కు పనిమీద వచ్చిన జర్నలిస్టు కుక్క వద్ద కాసేపు ఉన్నందుకు ఇంత ప్రేమ చూపింది. అది తనపై చూపిస్తున్న ప్రేమకు కరిగిపోయిన ఆ జర్నలిస్ట్ ఆ కుక్కను దత్తత తీసుకున్నాడు.
ఈ వీడియోను ఓ ఎక్స్ యూజర్ పోస్ట్ చేస్తూ.. షెల్టర్ వద్ద ఉన్న కుక్క ఓ జర్నలిస్ట్ చేతిని పట్టుకుని వదలేదని, దీంతో ఆ జర్నలిస్ట్ కుక్కను దత్తత తీసుకున్నాడని చెప్పాడు. ఈ వీడియోకు కొన్ని మిలియన్ల వ్యూస్ వచ్చాయి. జంతు ప్రేమికులకు ఈ వీడియో బాగా నచ్చుతోంది. కుక్కను పెంచుకుంటే మన ఒత్తిడి తగ్గుతుందని చాలా మంది కామెంట్లు చేశారు. కుక్కను దత్తకు తీసుకున్న జర్నలిస్టుపై ప్రశంసల జల్లు కురిపించారు.
Barınaktaki köpek gazetecinin elini tutuyor ve bırakmak istemiyor. Daha sonra gazeteci köpeği sahipleniyor. pic.twitter.com/uay6SwpPPt
— Engelli Canlara Öncelik (@OncelikEngelli) February 18, 2025