Ajith Kumar : రేసింగ్ లో తిరగబడ్డ స్టార్ హీరో కార్.. 40 రోజుల గ్యాప్ లోనే మరోసారి తప్పిన ప్రమాదం.. ఆందోళనలో ఫ్యాన్స్..

తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కార్, బైక్ రేసర్ అని తెలిసిందే.

Ajith Kumar : రేసింగ్ లో తిరగబడ్డ స్టార్ హీరో కార్.. 40 రోజుల గ్యాప్ లోనే మరోసారి తప్పిన ప్రమాదం.. ఆందోళనలో ఫ్యాన్స్..

Tamil Star Hero Ajith Kumar Escaped from Car Racing Accident Again

Updated On : February 23, 2025 / 12:34 PM IST

Ajith Kumar : తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కార్, బైక్ రేసర్ అని తెలిసిందే. అజిత్ అధికారికంగా పలు దేశాల్లో బైక్ రేసింగ్, కార్ రేసింగ్స్ లో పాల్గొంటారు. ఇక్కడ సినిమాలు ఉన్నప్పుడు చేసేసి ఎక్కువగా రేసింగ్ కి వెళ్తుంటారు. ఫ్యాన్స్ కూడా అజిత్ రేసింగ్ ని ఎంజాయ్ చేస్తారు. ఇటీవలే అజిత్ దుబాయ్ లో రేసింగ్ ట్రాక్ లో ప్రాక్టీస్ చేస్తుండగా కార్ ట్రాక్ ఎడ్జ్ కి ఢీకొని ప్రమాదం జరిగింది. ఆ ఘటన నుంచి అజిత్ ఎలాంటి గాయాలు లేకుండానే బయటపడ్డాడు.

Also See : Swathishta Krishnan : ‘విక్రమ్’లో కమల్ హాసన్ కోడలు గుర్తుందా.. ఇప్పుడు బుల్లి స్కర్ట్ లో ఇలా క్యూట్ పోజులు..

ఆ ఘటన జరిగి 40 రోజుల గ్యాప్ లోనే అజిత్ మరోసారి రేసింగ్ లో ప్రమాదానికి గురయ్యారు. అయితే ఈ సారి కూడా అజిత్ కి ఏం కాలేదు. అజిత్ ప్రస్తుతం స్పెయిన్ లో జరుగుతున్న కార్ రేసింగ్ లో పాల్గొంటున్నాడు. గత కొన్ని రోజులుగా స్పెయిన్ లోనే ఉన్నాడు. రేసింగ్ లో మరో కార్ ని తప్పించే క్రమంలో అజిత్ కార్ ట్రాక్ తప్పి పల్టీ కొట్టింది. వెంటనే అక్కడి సిబ్బంది అలర్ట్ అవ్వడంతో అజిత్ క్షేమంగా బయటపడ్డాడు.

Also Read : Sai Pallavi : వీడెవడ్రా బాబు.. సాయి పల్లవి తండేల్ లో ఇతని డ్యాన్స్ కాపీ కొట్టిందట.. బెంగుళూరు నుంచి వచ్చి న్యాయం కావాలని..

గతంలో కూడా అజిత్ కార్ రేసింగ్ లో పలు మార్లు ప్రమాదానికి గురయ్యారు. దీంతో అభిమానులు రేసింగ్ చేసినా జాగ్రత్త అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అజిత్ ఇటీవల విదాముయార్చి సినిమాతో రాగా ఆ సినిమా యావరేజ్ గా నిలిచింది. త్వరలో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో రానున్నాడు.