New Variant In Delhi : ఢిల్లీలో కొత్త వేరియంట్ కలకలం

ఢిల్లీతోపాటు అమెరికాలోనూ కేసులు పెరగడానికి BA.2.12.1 వేరియంట్ కారణమని అధికారులు తెలిపారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నామని చెప్పారు.

New variant in Delhi : ఢిల్లీలో కొత్త వేరియంట్ కలకలం రేపింది. కరోనా పేషెంట్లలో ఒమిక్రాన్ BA.2.12.1 వేరియంట్ ను అధికారులు గుర్తించారు. ఈ కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ BA.2 వేరియంట్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని అధికారులు వెల్లడించారు. అమెరికాలోనూ ఒమిక్రాన్ BA.2.12.1 వేరియంట్ కేసులను గుర్తించారు.

ఢిల్లీతోపాటు అమెరికాలోనూ కేసులు పెరగడానికి BA.2.12.1 వేరియంట్ కారణమని అధికారులు తెలిపారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నామని చెప్పారు. కొత్త వేరియంట్ పై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఢిల్లీలో ముందుగా పదుల సంఖ్యలో పెరిగిన కేసులు.. ఒక్కసారిగా వందలు, వేల సంఖ్యకు చేరాయి.

Covid-19: ఒక్కరోజే వెయ్యి దాటిన కరోనా కేసులు

తాజాగా 1009 కొత్త కేసులు నమోదు అయ్యాయి. కాగా, కరోనా బారిన పడి ఒకరు మృతి చెందారు. ఇక పాజిటివిటీ రేట్ 5.70 శాతంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. కొత్త వేరియంట్ వల్లే కేసులు భారీగా పెరుగుతున్నాయని అధికారులు గుర్తించారు.

దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా ఢిల్లీలోనే నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో ప్రజలు కోవిడ్ నిబంధనల పట్ల అలసత్వం ప్రదర్శిస్తుండటం వల్లే కేసులు మళ్లీ పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు