Site icon 10TV Telugu

Wedding Gift Blast: పెళ్లి గిఫ్ట్ బ్లాస్ట్.. చేతిని కోల్పోయిన కొత్త పెళ్లి కొడుకు!

Wedding Gift Blast

Wedding Gift Blast

Wedding Gift Blast: సంప్రదాయంగా, అంగరంగ వైభవంగా ఒక్కటైన కొత్త జంట పెళ్లి హడావుడి అంతా ముగిసిన తర్వాత.. వాళ్ళ పెళ్లికి వచ్చిన బహుమతులను ఓపెన్ చేసి ఏఏ గిఫ్ట్స్ వచ్చాయో చూసుకుంటున్నారు. ఫ్రెండ్స్, బంధువులు ఎవరు ఏ గిఫ్ట్స్ ఇచ్చారో చూసుకుంటుండగా.. అందులో ఓ గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తే.. అందులో ఒకటి రీఛార్జ్‌బుల్ టాయ్ ఉంది. దాన్ని తీసి రీఛార్జ్ పెట్టేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా అది బ్లాస్ట్ అయింది. దీంతో పెళ్లి కుమారుడు, పక్కనే ఉన్న పెళ్లి కుమార్తె కూడా తీవ్రంగా గాయపడ్డారు.

Wedding Cake Payment : పెళ్లిలో తిన్న కేకుముక్కకు డబ్బులు కట్టమని అతిథిని డిమాండ్ చేసిన కొత్తజంట..

గుజరాత్‌లోని నవ్సారి జిల్లాలోని మింధబారి గ్రామంలో మే 12వ తేదీన లతీష్ గవిత్, సల్మాలపెళ్లి ఘనంగా జరిగింది. ఈ వివాహానికి బంధువులు, స్నేహితులు హాజరై వధూవరులను ఆశీర్వదించి కొందరు బహుమతులు కూడా ఇచ్చారు. పెళ్లి హడావుడి అంతా ముగిసిన తర్వాత మే 17న లతీష్, అతని మేనల్లుడు జియాన్‌‌ తో కలిసి తమ ఇంట్లో పెళ్లికి వచ్చిన బహుమతులను ఓపెన్ చేయడం మొదలు పెట్టారు. ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూస్తుండగా.. అందులో ఉన్న ఒక రీఛార్జ్‌బుల్ టాయ్ ని చూసి రీఛార్జ్ పెట్టేందుకు ప్రయత్నించారు.

Tamil Nadu Couple : కొత్తగా పెళ్లైన జంటకు సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెట్రోల్, డీజిల్ చూసి షాక్..!

అంతలో ఆ రీఛార్జబుల్ టాయ్ బ్లాస్ట్ అయింది. ఈ ఘటనలో కొత్త పెళ్లికొడుకు లతీష్‌ చేతులు, తలకు, కళ్లకు తీవ్ర గాయాలవగా అతని కుడి మణికట్టు నుంచి చేతిని తొలగించాల్సి వచ్చింది. ఇక, మేనల్లుడు జియాన్‌కు తల, కళ్లలో గాయాలయ్యాయి. దీంతో వీరిద్దరిని నవ్‌సారి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ గిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గిఫ్ట్ ఇచ్చిన రాజు పటేల్ అనే వ్యక్తి సల్మా అక్కకు ఎక్స్‌బాయ్ ఫ్రెండ్‌ కాగా.. సల్మా అక్క పెళ్లి తర్వాత కూడా వీరి మధ్య వివాహేతర సంబంధం ఉండేదని, కొంతకాలం క్రితం వీరిద్దరూ విడిపోయినట్టు గుర్తించారు.

Exit mobile version