NIA Conducts Raid: పీఎఫ్ఐ లక్ష్యంగా దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గత ఏడాది సెప్టెంబర్ నెలలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ), దాని అనుబంధ సంస్థలను చట్టవిరుద్దమైన సంఘంగా ప్రకటించిన విషయం విధితమే.

NIA conducts raids

NIA Conducts Raid: నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)ని లక్ష్యంగాచేసుకొని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) మంగళవారం ఉదయం నాలుగు రాష్ట్రాల్లో సోదారులు నిర్వహిస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఒక్క బిహార్‌ రాష్ట్రంలోనే 12 ప్రాంతాల్లో ఏకకాలంలో ఎన్ఐఎ అధికారులు సోదాలు చేపట్టారు. యూపీలో రెండు చోట్ల, పంజాబ్‌లోని లూథియాగా, గోవాలో ఒక్కొక్క ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి.

 

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గత ఏడాది సెప్టెంబర్ నెలలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ), దాని అనుబంధ సంస్థలను చట్టవిరుద్దమైన సంఘంగా ప్రకటించిన విషయం విధితమే. ఎన్ఐఏ ప్రకారం.. పీఎఫ్ఐ ముస్లిం యువకులు, సమాజంలో అట్టడుగు వర్గాల వారికి ఉపాధి కల్పించడం వంటి ముసుగులో సంస్థ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేయడానికి ప్రణాళికా బద్దమైన వ్యూహాన్ని కలిగి ఉందని పేర్కొంది. ఇదిలాఉంటే నిషేధిత సంస్థకు చెందిన వారిపై తాజా అణిచివేత, చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు 15 రాష్ట్రాల్లోని 93 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించిన కొన్ని నెలల తర్వాత ఇప్పటి వరకు అతిపెద్ద దర్యాప్తు ప్రక్రియ అని అధికారులు అభివర్ణించారు.