Nipah Virus: హడలెత్తిస్తున్న నిఫా..పండ్లు తినే విషయంలో ఎయిమ్స్‌ కీలక సూచనలు

నిఫా వైరస్ కలకలం సృష్టిస్తున్న క్రమంలో నిపుణులు పండ్లు తినే విషయంలోను..పెంపుడు జంతువుల విషయంలోను జాగ్రత్తలు తప్పనిసరి అని సూచిస్తున్నారు. లేదంటే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు.

Nipah Virus Fruits Must Wash: ఇప్పటికీ కరోనాతో పోరాడుతునే ఉన్నాం. ఈ క్రమంలో పులిమీద పుట్రలాగా నిఫా కలకలం సృష్టిస్తోంది.కరోనా మొదటికేసు నమోదు అయిన కేరళలోనే ఈ నిఫా కూడా కలవరం కలిగిస్తోంది. నిఫా సోకి 12 ఏళ్ల బాలుడి మరణం తరువాత మరింత భయాందోళనలు కలుగుతున్నాయి. గబ్బిలాలు.జంతువుల నుంచి సక్రమించే నిఫా విషయంలో మరింతగా అప్రమత్తమవ్వాల్సిన అవసరం ఉంది. కేరళలో పన్నెండేళ్ల బాలుడు నిఫా వైరస్‌ తో చనిపోవటంతో పక్కనే ఉన్న తమిళనాడు కూడా అప్రమత్తమైంది. కేరళ పక్కనే ఉన్న తమిళ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.

ఈక్రమంలో ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు పలు కీలక సూచనలు చేశారు.ఫ్రూట్‌ బ్యాట్‌(గబ్బిలాలు) లాలాజలం నుంచి, వాటి విసర్జితాల నుంచి వైరస్ వ్యాప్తి చెందుతుంది. ప్రత్యేకించి చికిత్స విధానమంటూ నిపా వైరస్‌కు లేకపోవడం వల్ల జాగ్రత్తగా ఉండడమే మార్గమని సూచిస్తున్నారు. ముఖ్యంగా పండ్లు తినే విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని..మార్కెట్ నుంచి తెచ్చిన పండ్లను కడిగి తినాలని సూచిస్తున్నారు.

సెప్టెంబర్‌ 5న నిఫాతో కేరళ కోజికోడ్‌ బాలుడు చనిపోగా..సదరు బాలుడు రాంభూటాన్ పండ్లు తినటం వల్లనే చనిపోయాడా?అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో కేరళలో నిఫా మరణం నమోదు అయ్యిన తరువా కేంద్రం నుంచి కేరళకు వచ్చిన నిపుణుల బృందం చనిపోయిన బాలుడి ఇంటి నుంచి సేకరించిన ‘రాంభూటాన్‌ పండ్ల’ (చెట్టు నుంచి కిందపడిన పండ్లు) నమూనాలను సేకరించారు. వాటిని పరీక్షల కోసం తరలించారు. ఈక్రమంలో నిఫా వైరస్‌ నిర్ధారణ అయిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తు ఎయిమ్స్ డాక్టర్‌ బిస్వాస్‌ పండ్లు తినే విషయంలో పలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

గబ్బిలాలు నిఫా వాహకాలు కారణంగా ఉండటంతో గబ్బిలాలు కొరికిన పండ్ల వల్ల నిపా వైరస్‌ సోకుతుందని వెల్లడించారు. చాలామంది చెట్ల మీద నుంచి పడిన పండ్లను ఇష్టంగా తింటారు. ఎందుకంటే అవి చెట్టుకు సహజ సిద్దంగా పండినవి కాబట్టి మంచి రుచి ఉంటుందని బావిస్తారు. అందుకే చెట్ల నుంచి రాలి పడన పండ్లను ఎంతో ఇష్టంగా తింటారు. పండిరాలిన పండ్లు తింటే ఏమీ కాదు కానీ..సగం కొరికి కింద పడ్డ పండ్లను తింటేనే ప్రమాదనమని హెచ్చరిస్తున్నారు. సాధారణంగా మనం చెట్లనుంచి సగం కొరికి పడిన పండ్లను ‘చిలక కొట్టిన పండ్లు’అనుకుంటాం. కానీ వాటిని చిలుకలే కొరికాయని అనుకోవటానికి వీల్లేదు.వాటిని గబ్బిలాలు కూడా కొరికి తిని ఉండవచ్చు…!!

కాబట్టి పండ్లు తినే విషయంలోను..ముఖ్యంగా చెట్లు నుంచిపడిన పండ్లు తినే విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వాటిని కడకుండా తింటే మరింత ప్రమాదమని హెచ్చరిస్తున్నారు డాక్టర్‌ బిస్వాస్‌. పండ్లు మార్కెట్ నుంచి కొని తెచ్చినవైనా..చెట్ల నుంచి కోసినవైనా..చెట్ల నుంచి రాలిపడినవైనా సరే ఏవైనా సరే శుభ్రంగా కడిగి లేదా ఉప్పు నీళ్లతో కడిగి తినాలని సూచిస్తున్నారు. వర్షాకాలం ఈ జాగ్రత్త తప్పక పాటించాలని..లేకుంటే వైరస్ లు సోకే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తు‍న్నారు.

జాగ్రత్తలు తప్పనిసరి..
ఈ నిఫా కలకలం రేగుతున్న క్రమంలో అన్ని జాగ్రత్తలు పాటించాలని..ముఖ్యంగా పెంపుడు జంతువుల విషయం తప్పనిసరి. పెంపుడు జంతువులను బయటకు తీసుకెళ్లినప్పుడు వాటిని పరిశీలించాలి. చేతులను తరచు సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. ఆహారాన్ని పూర్తిగా ఉడికించి తినాలి. పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలి తప్పనిసరిగా.

నిఫా వైరస్ సోకితే..లక్షణాలు
జ్వరం, శ్వాసకోశ సమస్యలు, ఒళ్లు నొప్పులు,తలనొప్పి,వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లాలి.వారి సూచనలు ప్రకారం టెస్టులు చేయించుకోవాలి. నిఫాగా నిర్ధారణ అయితే డాక్టర్లు చెప్పినట్లుగా పాటించాలి.కాగా..మలేషియాలో పందుల పెంపకందారులకు మొదటిసారిగా నిపా వైరస్‌ సోకింది. భారత్‌లో మొదటిసారి పశ్చిమబెంగాల్‌లోను. రెండవసారి కేరళలో ప్రబలింది. ఈ వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉండదని కాబట్టి తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఎందుకంటే దీనికి పర్టిక్యులర్ వైద్యం అంటూ లేదు కాబట్టి తప్పనిసరిగా జాగ్రత్తలు అవసరం పదే పదే చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు