మసూద్ గ్లోబల్ టెర్రరిస్ట్…ఇది భారతీయుడి విజయం

జైషే చీఫ్ మ‌సూద్ అజ‌హర్‌ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా బుధవారం(మే-1,2019)యునైటెడ్ నేషన్స్ ప్రకటించిన సందర్భంగా ఇవాళ(మే-2,2019) కేంద్ర ప్ర‌భుత్వం దీనిపై స్పందించింది.ఇది ప్ర‌తి భార‌తీయుడి విజ‌యం అని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. మ‌సూద్ ను ఉగ్ర‌వాదిగా ప్ర‌క‌టించేందుకు త‌మ ప్ర‌భుత్వం తీవ్ర ప్ర‌య‌త్నం చేసింద‌న్నారు. ఈ విష‌యంలో ప్ర‌భుత్వాన్ని, ప్ర‌ధాని మోడీని మెచ్చుకోవాల‌ని జైట్లీ అన్నారు. దేశం గెలిచిన‌ప్పుడు, అది ప్ర‌తి భార‌తీయుడి విజ‌యం అవుతుంద‌న్నారు. ప్ర‌తిప‌క్షాలు ఈ విక్ట‌రీని పంచుకోవ‌డంలో ఇబ్బందిప‌డుతున్నాయ‌ని విమ‌ర్శించారు. 
ఉగ్ర‌వాదాన్ని ఏమాత్రం స‌హించేది లేద‌ని రక్షణశాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ అన్నారు. మ‌సూద్‌ ను గ్లోబ‌ల్ టెర్ర‌రిస్టుగా యూఎన్ ప్ర‌క‌టించ‌డంచెప్పుకోదగిన విష‌య‌మ‌న్నారు.విదేశాంగ శాఖ నిరంత‌రం చేప‌ట్టిన చ‌ర్య‌ల వ‌ల్ల, ప్రధాని మోడీ నేతృత్వంలో,ఆయన స్వతహాగా ప‌దేప‌దే చేప‌ట్టిన ప‌ర్య‌ట‌న‌ల వ‌ల్ల ఇది వీలైంద‌ని మంత్రి సీతారామ‌న్ తెలిపారు.