Mamata on opposition unity: మేమందరం ఒక్కటవుతాం.. వచ్చే లోక్‌‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించి తీరతాం: మమతా బెనర్జీ 

ఇవాళ కోల్ కతాలో నిర్వహించిన టీఎంసీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ... ‘‘నేను, నితీశ్ కుమార్, హేమంత్ సోరెన్, ఇతర నేతలు 2024 లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోరాడతాం. బీజేపీని ఓడించేందుకు దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు చేతులు కలుపుతాయి. మేమంతా ఓ వైపు, బీజేపీ ఒక వైపు ఉంటుంది. 300కు పైగా సీట్లు ఉన్నాయన్న బీజేపీ అహంకారమే ఆ పార్టీకి శత్రువు. 2024లో ఆట మొదలవుతుంది’’ అని చెప్పారు.

Mamata on opposition unity: దేశంలోని ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఒక్కటవుతాయని వచ్చే లోక్‌‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించి తీరతామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఇవాళ కోల్ కతాలో నిర్వహించిన టీఎంసీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ… ‘‘నేను, నితీశ్ కుమార్, హేమంత్ సోరెన్, ఇతర నేతలు 2024 లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోరాడతాం. బీజేపీని ఓడించేందుకు దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు చేతులు కలుపుతాయి. మేమంతా ఓ వైపు, బీజేపీ ఒక వైపు ఉంటుంది. 300కు పైగా సీట్లు ఉన్నాయన్న బీజేపీ అహంకారమే ఆ పార్టీకి శత్రువు. 2024లో ఆట మొదలవుతుంది’’ అని చెప్పారు.

”సీబీఐ, ఈడీ ద్వారా మమ్మల్ని బెదిరించవచ్చని బీజేపీ అనుకుంటోంది. ఇటువంటి ట్రిక్కులను ఎన్ని వాడితే అంతగా ఎన్నికల్లో ఓటమికి బీజేపీ చేరువవుతుంది” అని మమతా బెనర్జీ అన్నారు. బీజేపీ, ఓ వర్గ మీడియా తనపై అసత్య ప్రచారం చేస్తున్నాయని మమతా బెనర్జీ చెప్పారు. ఢిల్లీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహ ఆవిష్కరణ కోసం రావాలని తనకు ఓ లేఖ అందిందని, అయితే, ఆ లేఖలో తనను ఆహ్వానించిన తీరు బాగోలేదని అన్నారు.

ప్రధాని మోదీ రాత్రి 7 గంటలకు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని, తాను సాయంత్రం 6 గంటలలోపు అక్కడ ఉండాల్సిందేనంటూ ఆ లేఖలో రాశారని మమతా బెనర్జీ చెప్పారు. తాను వారి కింద పనిచేసే వ్యక్తిలా భావిస్తూ ఆ లేఖ రాసినట్లు ఉందని చెప్పారు. ముఖ్యమంత్రికి లేఖ రాసే తీరు ఇలాగేనా అని ప్రశ్నించారు.

Heavy rains in Andhra Pradesh: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో అతి భారీవర్షాలు కురిసే అవకాశం

ట్రెండింగ్ వార్తలు