Nitish Kumar: బిగ్ ట్విస్ట్.. బీజేపీతో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం నితీశ్ కుమార్ ఏం చేస్తున్నారో తెలుసా?

ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. బిహార్‌లో జేడీ(యూ)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Nitish Kumar

న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం జరుగుతోంది. బిహార్ రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. బిహార్‌లో జేడీ(యూ)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఆర్జేడీతో తెగదెంపులు చేసుకుని బయటకు వచ్చే యత్నంలో సీఎం నితీశ్ కుమార్ ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ చేపట్టాల్సిన చర్యలు, మంత్రివర్గ కూర్పు తదితర అంశాలపై బీజేపీ కార్యాలయంలో చర్చ జరుగుతోంది.

ఇండియా కూటమి తనకు కన్వీనర్ పోస్టు తనకు ఇవ్వకపోవడం, కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు ఆలస్యం చేయడం అంశాలపై నితీశ్ కుమార్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. పాట్నా రాజ్ భవన్‌లో గవర్నర్ హాయ్ టీ కార్యక్రమంలో నితీశ్ కుమార్ పాల్గొన్నారు.

మరోవైపు, బిహార్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో తొందర లేదంటోంది బీజేపీ. రేపు, ఎల్లుండి పాట్నాలో బీజేపీ కార్యవర్గ సమావేశం జరిగే అవకాశం ఉందని బీజేపీ ఎంపీ సుశీల్ మోదీ అన్నారు. బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఇప్పుడే చెప్పలేనని అన్నారు.

రాజకీయాల్లో పొత్తుల కోసం శాశ్వతంగా తలుపులు మూసి ఉండవని చెప్పారు. అవసరాన్ని బట్టి తలుపులు తెరుచుకుంటాయి.. అవసరాన్ని బట్టి తలుపులు మూతపడతాయి అని తెలిపారు. తాను రాజ్యసభ ఎంపీగా ఉన్నానని గుర్తుచేశారు. తాను డిప్యూటీ సీఎం అన్నది ప్రచారం మాత్రమే అని సుశీల్ మోదీ చెప్పారు. కాగా, ఈ నెల 28న కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

అనర్హత పిటిషన్.. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల వినతిని తిరస్కరించిన స్పీకర్

ట్రెండింగ్ వార్తలు