Bihar: స్తంభాన్ని ఢీకొట్టిన సీఎం ప్రయాణిస్తున్న పడవ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‭తో పాటు జలవనరుల శాఖ మంత్రి సంజయ్ ఝా, సీనియర్ అధికరులు అమృత్, ఆనంద్ కిషోర్ ఉన్నారు. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న పడవకు భద్రతగా కొంత మంది పోలీసులు చిన్న పడవల్లో వెంట వచ్చారు. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న స్టీమర్ గంగానది ఘాట్‌లను పరిశీలిస్తున్న సమయంలో గంగానదికి అడ్డంగా ఉన్న వంతెన స్తంభాన్ని ఢీకొట్టిందని ప్రాథమిక నివేదికలు పేర్కొన్నాయి

Bihar: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రయాణిస్తున్న పడవ స్తంభాన్ని ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రమాదబారిన పడకుండా సీఎం నితీశ్ తృటిలో తప్పించుకున్నారు. శనివారం గంగా నది వద్ద ఉన్న ఛాత్ ఘాట్‭ను సీఎం నితీశ్ సందర్శించడానికి వెళ్తున్న సమయంలో ఇది జరిగింది. ఆ పడవలో ఆయనతో పాటు మరికొందరు ఉన్నారు. వారికి కూడా ప్రమాదం సురక్షితంగా బయట పడ్డట్లు సమాచారం. అయితే ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న పడవ స్తంభాన్ని ఢీకొట్టిందన్న వార్తల్ని ప్రభుత్వ అధికారులు కొట్టపారేశారు.

ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‭తో పాటు జలవనరుల శాఖ మంత్రి సంజయ్ ఝా, సీనియర్ అధికరులు అమృత్, ఆనంద్ కిషోర్ ఉన్నారు. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న పడవకు భద్రతగా కొంత మంది పోలీసులు చిన్న పడవల్లో వెంట వచ్చారు. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న స్టీమర్ గంగానది ఘాట్‌లను పరిశీలిస్తున్న సమయంలో గంగానదికి అడ్డంగా ఉన్న వంతెన స్తంభాన్ని ఢీకొట్టిందని ప్రాథమిక నివేదికలు పేర్కొన్నాయి. అయితే స్టీమర్‌ స్తంభాన్ని ఢీకొట్టిందన్న వార్తలను అధికారులు కొట్టిపారేశారు. గంగా నదిని పరిశీలించడానికి ఒక స్టీమర్ మీద వెళ్లిన సీఎం.. తిరిగి వచ్చేటప్పుడు మరొక స్టీమర్‭లో వచ్చినట్లు పేర్కొన్నారు.

Apple iPhone 13 : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఇండియాలో ధర ఎంతో తెలుసా? మరెన్నో ఆఫర్లు.. డోంట్ మిస్!

ట్రెండింగ్ వార్తలు