CBSE exams Cancelled: సీబీఎస్ఈ పరీక్షలు రద్దు.. ప్రధాని మోడీ నిర్ణయం

ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. సుప్రీం కోర్టులో తన రిప్లైను జూన్ 3న సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ గురించి

No Cbse Class 12 Exams This Year Decision In The Interest Of Students Pm Modi

CBSE exams Cancelled: ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని వెల్లడించారు. సుప్రీం కోర్టులో తన రిప్లైను జూన్ 3న సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ గురించి వెల్లడించనుంది కేంద్ర ప్రభుత్వం.

ఆరోగ్యంతో పాటు భద్రతను దృష్టిలో ఉంచుకుని.. వాటి ప్రాముఖ్యత విషయంలో మిగిలిన వాటిని పక్కకుపెట్టి నిర్ణయం తీసుకున్నామని ప్రధాన మంత్రి కార్యాలయం స్టేట్మెంట్ ఇచ్చింది. విద్యార్థుల్లో, పేరెంట్స్ లో, టీచర్లలో ఆందోళనకు ముగింపు పలకాలనుకున్నాం. ఇటువంటి ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో పరీక్షలు రాయమని విద్యార్థులను ఇబ్బందిపెట్టడం లేదు. అని పేర్కొన్నారు.

ప్రధాని నిర్ణయంతో ముగిసిన సమావేశంలో కీలక వ్యక్తులు పాల్గొన్నారు. యూనియన్ డిఫెన్స్ మినిష్టర్ రాజ్ నాథ్ సింగ్, ఎన్మిరాన్మెంట్ మినిష్టర్ ప్రకాశ్ జవదేకర్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఛైర్మన్ మనోజ్ అహుజాలతో పాటు ఇతరులు పాల్గొన్నారు.

ఎడ్యుకేషన్ మినిష్టర్ రమేశ్ పొక్రియాల్ నిశాంక్ అనారోగ్యం కారణంగా ఎయిమ్స్ లో చేరిన రీత్యా జూన్ 1న నిర్ణయం తీసుకున్నారు.