No Confidence Motion: బొక్కబోర్లా పడ్డ విపక్షాలు.. అవిశ్వాస తీర్మానం ఫెయిల్, ప్రభుత్వం నుంచి రాబట్టిందీ ఏమీ లేదు

గురువారం లోక్‭సభలో మోదీ ప్రసంగిస్తుండగా.. మణిపూర్ అంశంపై మోదీ నోరు విప్పాలంటూ విపక్ష నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే మోదీ అవేవీ పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ వెళ్లారు

Lok Sabha: మోదీ ప్రభుత్వంపై విపక్షాల కూటమి ‘ఇండియా‌ కూటమి’ తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానం గురువారం విఫలమైంది. మూజువాణి ఓటుతో కేంద్ర ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఓడించింది. వాస్తవానికి దీనిపై ఓటింగ్ జరిగే ముందే విపక్షాలు లోక్‭సభ నుంచి వాకౌట్ చేశాయి. సుదీర్ఘంగా సాగిన ప్రధాని మోదీ ప్రసంగం అనంతరం ఓటింగ్ పెట్టగా.. మూజువాణి ఓటుతో వీగిపోయింది. వాస్తవానికి ఓడిపోతామని తెలిసి కూడా విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాయి. అయితే మణిపూర్ అంశంపై ప్రధాని మోదీని మాట్లాడించడమే లక్ష్యంగా, ఆయనను ఇరకాటపెట్టేందుకు పెట్టినప్పటికీ.. అది ఫలించలేదు.

No Confidence Motion: మోదీ ప్రసంగాన్ని అడ్డుకున్న స్పీకర్.. పార్లమెంటులో ఏం జరిగిందో తెలుసా?

గురువారం లోక్‭సభలో మోదీ ప్రసంగిస్తుండగా.. మణిపూర్ అంశంపై మోదీ నోరు విప్పాలంటూ విపక్ష నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే మోదీ అవేవీ పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ వెళ్లారు. అయితే విపక్షాలు ఫ్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున అదే పనిగా నినాదాలు చేశారు. ఒకవైపు విపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తుండగా, మరొకవైపు ప్రధాని ప్రసంగానికి కొనసాగింపుగా అధికార పక్షంలోని నేతలు కూడా అనుకూల నినాదాలు చేశారు.

No Confidence Motion: పార్లమెంటు నుంచి ‘ఇండియా’ ఔట్.. బాధ కలుగుతోందన్న ప్రధాని మోదీ

అయితే తమ డిమాండును ప్రధానమంత్రి లెక్కచేయకపోవడంతో ఇండియా కూటమిలోని విపక్షాలన్నీ పార్లమెంటు నుంచి వాకౌట్ చేశాయి. వెళ్లున్న విపక్షాల్ని చూసి ప్రధాని విస్మయం వ్యక్తం చేశారు. దేశం అంతా ఏకమై మణిపూర్ గురించి చర్చించాల్సిన సమయంలో విపక్షాలు వాకౌట్ చేయడం సరి కాదని అన్నారు. ఇందిరా గాంధీ నాయకత్వంలో ఇలా జరగలేదని ప్రధాని గుర్తు చేశారు. నేటి విపక్షాల తీరు చూసి తన హృదయం బాధిస్తోందని మోదీ అన్నారు.