No Covid Death : 348 రోజుల తర్వాత..ఆ జిల్లాలో కోవిడ్ మరణాలు జీరో

దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు,మరణాలు క్రమంగా తగ్గుతున్నాయి.

Nagpur

No Covid Death దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు,మరణాలు క్రమంగా తగ్గుతున్నాయి. మహారాష్ట్రలోని నాగ్ పూర్ జిల్లాలో 348 రోజుల తర్వాత ఆదివారం ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. కోవిడ్ మొదటి దశ పీక్ జులై-6,2020కి ముందు నాగ్ పూర్ జిల్లాలో ఒక్క కోవిడ్ మరణం కూడా లేదు. అంటే దాదాపు ఏడాది తర్వాత నాగ్ పూర్ జిల్లాలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదుకాలేదు.

నాగ్ పూర్ సిటిలో వరుసగా మూడో రోజు కోవిడ్ మరణం ఒక్కటి కూడా నమోదుకాలేదని అదేవిధంగా నాగ్ పూర్ రూరల్(గ్రామీణం)లో వరుసగా ఎనిమిదో రోజు కోవిడ్ మరణం నమోదుకాలేదని ఆదివారం మహారాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక,నాగ్ పూర్ జిల్లాలో ఆదివారం నాటికి యాక్టివ్ కేసుల సంఖ్య కూడా వెయ్యి లోపుకి పడిపోయింది. ప్రస్తుతం నాగ్ పూర్ జిల్లాలో 907 యాక్టివ్ కోవిడ్ కేసులు మాత్రమే ఉన్నట్లు తెలిపింది.

కాగా,ఫిబ్రవరి 3వ వారంలో నాగ్ పూర్ జిల్లాలో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఏప్రిల్-19,2021న అత్యధికంగా 113మరణాలు జిల్లాలో నమోదయ్యాయి. అయితే మే నెల నుంచి కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇక,కేసుల సంఖ్య పడిపోవడానికి హార్డ్ ఇమ్యూనిటీ కారణమై ఉండవచ్చునని నిపుణులు చెబుతున్నారు. మరియు ప్రస్తుత వాతావరణం కూడా వైరల్ ఇన్ఫెక్షన్లకు అనుకూలంగా లేదని తెలిపారు. కాగా,ఆదివారం దేశవ్యాప్తంగా పలు జిల్లాల్లో కూడా కోవిడ్ మరణాలు నమోదు కాలేదు.