యూపీలో బంగారు గనులు.. బాంబు పేల్చిన జీఎస్ఐ

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సోన్ భద్ర(sonbhadra) జిల్లాలో బంగారు నిక్షేపాలు(gold deposits) వెలుగుచూశాయి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ, GSI) బంగారు గనులు

  • Publish Date - February 23, 2020 / 03:09 AM IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సోన్ భద్ర(sonbhadra) జిల్లాలో బంగారు నిక్షేపాలు(gold deposits) వెలుగుచూశాయి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ, GSI) బంగారు గనులు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సోన్ భద్ర(sonbhadra) జిల్లాలో బంగారు నిక్షేపాలు(gold deposits) వెలుగుచూశాయి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ, GSI) బంగారు గనులు కనుగొంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3వేల టన్నుల బంగారం నిక్షేపాలు. వాటి విలువ రూ.12లక్షల కోట్లు. ఇది దాదాపు భారత దేశ సంపదకు 5 రెట్లు ఎక్కువ. ఈ అపార పసిడి రాశులతో మన దేశం.. ప్రపంచంలో అత్యధిక బంగారు నిక్షేపాలున్న రెండో దేశంగా మారింది.

సోన్ భద్రలో రెండు దశబ్దాలుగా GSI, యూపీ డైరెక్టరేట్ ఆఫ్ జియాలజీ అండ్ మైనింగ్ సంయుక్తంగా సాగించిన గనుల తవ్వకాల్లో రెండు భారీ బంగారం నిక్షేపాలు బయటపడ్డాయి. నక్సలైట్ ప్రభావిత ప్రాంతమైన సోన్ భద్ర జిల్లాలో వేలాది టన్నుల బంగారు నిక్షేపాలను అధికారులు గుర్తించారు. సోన్ పహాడీ, హర్ది ప్రాంతాల్లో ఈ బంగారం గనులు కనుగొన్నారు. ఇవీ.. ఇప్పటివరకు మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలు. ఈ వార్తలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే కాదు.. భారత్ రూపురేఖలూ మారిపోతాయని అంతా సంబరపడ్డారు. కట్ చేస్తే.. జీఎస్ఐ అధికారులు దిమ్మతిరిగే నిజం చెప్పారు.

సోన్ భద్ర జిల్లాలో బంగారు నిక్షేపాల వార్తలపై జీఎస్ఐ అధికారులు స్పందించారు. అదంతా అవాస్తవం అన్నారు. అసలక్కడ బంగారమే లేదని జీఎస్ఐ బాంబు పేల్చింది. ఈమేరకు పూర్తి వివరాలతో ప్రకటన జారీ చేసింది. బంగారం గనులు వెలుగులోకి వచ్చాయని తాము చెప్పినట్లు వస్తున్న వార్తలను అధికారులు ఖండించారు. సోన్ భద్రలో తాము ఎలాంటి బంగారు నిక్షేపాలు కనుక్కోలేదని చెప్పారు. 3వేల టన్నులకుపైగా బంగారు నిక్షేపాలు ఉన్నాయన్న ప్రచారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.

‘బంగారం గనులు ఉన్నట్లు మేం చెప్పలేదు. మేం 1998 నుంచి 2000 మధ్య అక్కడ పరీక్షలు జరిపారు. కానీ ఫలితాలు ఆశాజనకంగా రాలేదు. అక్కడ 52వేల 800 టన్నుల ఖనిజం ఉన్నట్లు గుర్తించాం. టన్ను ఖనిజానికి 3.3 గ్రాముల బంగారం లభించే అవకాశముందని అప్పట్లోనే రాష్ట్రానికి చెప్పాం. ఆ లెక్కన అక్కడి ఖనిజాన్ని తవ్విపోస్తే 160 కేజీల బంగారం రావచ్చు. 3వేల 350 టన్నులు కాదు’ అని జీఎస్ఐ వివరించింది. జీఎస్ఐ ప్రకటన కాస్త చేదుగా ఉన్నా.. జీర్ణించుకోవాల్సిందే. అప్పటివరకు ఆనందంలో మునిగిపోయిన స్థానికులు.. జీఎస్ఐ ప్రకటనతో నిరాశ చెందారు. ఇది నిజమై ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటున్నారు.