ఆపరేషన్ సిందూర్ ఆపాలని ప్రపంచంలోని ఏ నాయకుడూ చెప్పలేదు: లోక్‌సభలో మోదీ ప్రకటన

"కాంగ్రెస్ తాము లాభపడాలనే స్వార్థంతో వ్యవహరించింది. భద్రతా బలగాల మనోధైర్యాన్ని దెబ్బతీసింది. ప్రపంచదేశాల నుంచి మనకు మద్దతు లభించినా, కాంగ్రెస్ మాత్రం మన సైనికుల ధైర్యానికి మద్దతు ఇవ్వలేదు" అని మోదీ అన్నారు.

ఆపరేషన్ సిందూర్ ఆపాలని ప్రపంచంలోని ఏ నాయకుడూ చెప్పలేదని లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆపరేషన్‌ సిందూర్‌పై లోక్‌సభలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు.

“పాక్ డీజీఎంఓ కాల్ చేశారు. దాడులు ఆపాలని కోరారు.. భారతదేశ ఉద్దేశాన్ని పాకిస్థాన్ సైన్యానికి స్పష్టంగా తెలియజేశాం. మనం అనుకున్నది 100 శాతం సాధించాం. భారత సైన్యం వెల్లడించిన వాస్తవాలను వదిలేసి, కొందరు పాక్ అసత్య ప్రచారాన్నే ముందుకు తీస కువెళ్తున్నారు.

Also Read: దమ్ముంటే ట్రంప్ అబద్ధాలకోరు అని చెప్పు.. లేదంటే..: లోక్‌సభలో మోదీకి రాహుల్ సవాల్

కాంగ్రెస్ తాము లాభపడాలనే స్వార్థంతో వ్యవహరించింది. భద్రతా బలగాల మనోధైర్యాన్ని దెబ్బతీసింది. ప్రపంచదేశాల నుంచి మనుకు మద్దతు లభించినా, కాంగ్రెస్ మాత్రం మన సైనికుల ధైర్యానికి మద్దతు ఇవ్వలేదు” అని మోదీ అన్నారు.

మే 9న అమెరికా వైస్‌ ప్రెసిడెంట్ జేడీ వాన్స్‌ తనతో ఫోన్‌లో మాట్లాడారని మోదీ అన్నారు. పాకిస్థాన్‌ భారీ దాడి చేయనుందని ఆయన చెప్పారని అన్నారని, దీంతో పాక్‌ భారీ మూల్యం చెల్లించుకుంటుందని తాను అన్నానని తెలిపారు. అలాగే, పాకిస్థాన్‌కు ఎవరు సాయం చేసినా తాము చూస్తూ ఊరుకోబోమని అన్నామని చెప్పారు. పాకిస్థాన్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయే సమాధానం ఇచ్చామని అన్నారు.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదులను మట్టుబెడతామని చెప్పామని, కలలో కూడా ఊహించని విధంగా వారిని శిక్షిస్తామని అన్నామని గుర్తుచేశారు. అఖిలపక్ష భేటీలోనూ చర్చించామని అన్నారు. పాకిస్థాన్‌ భూభాగంలోకి వెళ్లి మరీ ఉగ్రస్థావరాలపై దాడులు చేశామని అన్నారు.