విజిల్ వేయొద్దంటూ ఎమ్మెల్యేకు హెచ్చరికలు

విజిల్ వేయొద్దంటూ ఎమ్మెల్యేకు హెచ్చరికలు

Updated On : October 20, 2019 / 2:19 AM IST

జిల్లా ఎన్నికల అధికారి పార్టీ గుర్తు విజిల్ అయినప్పటికీ ప్రచారంలో వాడొద్దని ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. ఈ విషయంలో బహుజన్ వికాస్ అఘాడీ ఎమ్మెల్యే క్షితిజ్ ఠాకూర్ నోటీసులు అందుకున్నాడు. అక్టోబరు 212న జరగనున్న ఎన్నికల్లో భాగంగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

అక్టోబరు 16న ఎమ్మెల్యేకు కండిషన్లు పెట్టడంతో అక్టోబరు 19వరకూ ప్రచారం చేసుకోవచ్చని చెప్పినా పార్టీ గుర్తు వాడడం కుదరలేదు. అవసరానికి మించి విజిల్ ఊదుతున్నారని, తనతో పాటు నామినేషన్ వేసిన అభ్యర్థులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో అస్సలు విజిల్ ఊదకూడదంటూ రిటర్నింగ్ ఆఫీసర్ ఏవీ కదమ్ ఆర్డర్ పాస్ చేశారు. 

స్థానికులు, వయో వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు విజిల్ శబ్ధాలకు ఇబ్బందులకు గురువుతున్నారని ప్రచారం పద్ధతి మార్చుకోవాలని సూచించారు. నలసోపురా సిట్టింగ్ ఎమ్మెల్యే చేసేది లేక పార్టీ గుర్తును చూపించుకుంటూ ప్రచారాన్ని పూర్తి చేసుకున్నాడు. బహుజన్ వికాస్ అఘాడీ చీఫ్ హితేంద్ర ఠాకూర్ కొడుకైన క్షితిజ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నలసోపుర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాడు. ఆయనకు ప్రత్యర్థిగా శివసేన పార్టీ నుంచి మాజీ ఎన్ కౌంర్ స్పెషలిస్ట్ ప్రదీప్ శర్మ నామినేషన్ వేశారు.