Karnataka Govt : కేరళ, గోవా నుంచి కర్ణాటకకు వచ్చేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై ఆ రిపోర్టు అక్కర్లేదు..!

దేశంలో కరోనావైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రోజువారీ కరోనా కేసులు కూడా భారీగా తగ్గిపోయాయి.

Karnataka govt : దేశంలో కరోనావైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రోజువారీ కరోనా కేసులు కూడా భారీగా తగ్గిపోయాయి. కరోనా మరణాల సంఖ్య కూడా అలానే ఉంది. కరోనా తీవ్రత తగ్గిపోవడంతో ఇప్పటివరకూ విధించిన ఆంక్షలను పలు రాష్ట్రాలు సడలిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులను బట్టి పూర్తిగా ఆంక్షలను ఎత్తివేస్తున్నాయి. కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రక్రియ కూడా దాదాపు పూర్తి
అయ్యాయి. ప్రతిరాష్ట్రంలో సగానికి పైగా జనాభా రెండు డోసులను అందుకున్నాయి. ఈ క్రమంలో ఒక్కో రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి రాకపోకల విషయంలోనూ ఆంక్షలను రాష్ట్ర ప్రభుత్వాలు సడలిస్తున్నాయి. తమ రాష్ట్రాల్లోకి ప్రవేశానికి అనుమతినిస్తున్నాయి. ఇప్పటివరకూ రాష్ట్రాల్లోకి ప్రవేశించాలంటే తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగటివ్ రిపోర్టు చూపించాల్సి ఉంటుంది.

కానీ, ఇప్పుడు ఆ నిబంధనను కూడా ప్రభుత్వాలు ఎత్తేస్తున్నాయి. కేరళ, గోవాలో ఇటీవల కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికుల విషయంలో ఆంక్షలు విధించాయి. ఇప్పుడు ఆ రాష్ట్రాల్లోనూ రోజువారీ కరోనా కేసులు తగ్గిపోవడంతో ఇతర రాష్ట్రాల్లోకి ప్రవేశించేందుకు అక్కడివారికి అనుమతినిస్తున్నాయి. కర్ణాటక కూడా తమ రాష్ట్రంలోకి కేరళ, గోవా నుంచే ప్రయాణికులకు అనుమతినిచ్చింది. ఈ రెండు రాష్ట్రాల ప్రయాణికులు ఎవరూ ఆర్టీపీసీఆర్ నెగటివ్ రిపోర్టు చూపించాల్సిన అవసరం లేదని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటివరకూ ఉన్న ఆ నిబంధనను గురువారం ప్రభుత్వం ఎత్తివేసింది. అన్ని రకాల రవాణా మార్గాల ద్వారా కేరళ, గోవా నుంచి కర్ణాటకకు వచ్చే ప్రయాణీకులకు ఇకపై RT-PCR నెగటివ్ రిపోర్టు అవసరం లేదని కర్ణాటక ఆరోగ్య మంత్రి డాక్టర్ కె సుధాకర్ ట్వీట్ చేశారు.

గత వారం మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రయాణికులకు ఈ మినహాయింపు ఇచ్చామని ఆయన తెలిపారు. అయితే ఈ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు వ్యాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిసరి అని మంత్రి తెలిపారు. డిసెంబర్ 2021 చివరి వారం నుంచి ప్రారంభమైన కోవిడ్ -19 మూడవ వేవ్ తరువాత.. కర్ణాటక ప్రభుత్వం పరిమితులను విధించింది. కోవిడ్ -19 వ్యాక్సిన్ డబుల్ డోస్‌తో పాటు RT-PCR నెగటివ్ పరీక్షను కూడా తప్పనిసరిగా చేసింది.

మొదటి రెండు కరోనా వేవ్‌లతో పోలిస్తే.. మూడో వేవ్ తర్వాత క్రమంగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. అలాగే కరోనాతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా తగ్గింది. కరోనా మరణాల కూడా తక్కువగానే నమోదుకావడంతో కర్ణాటక ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. కర్ణాటకలో బుధవారం (ఫిబ్రవరి 16)న కొత్తగా 1,894 కోవిడ్ కేసులు నమోదు కాగా.. 24 కరోనా మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు 23,284గా ఉన్నాయి.

Read Also : Karnataka Schools : కర్ణాటకలో తెరుచుకున్న స్కూల్స్

ట్రెండింగ్ వార్తలు