Karnataka Schools : కర్ణాటకలో తెరుచుకున్న స్కూల్స్

ముందస్తు చర్యల్లో భాగంగా ఫిబ్రవరి 19 వరకు ఉడిపిలో అధికారులు 144 సెక్షన్‌ విధించారు. నేటి నుంచి ఫిబ్రవరి 19 సాయంత్రం 6 గంటల వరకు ఉడిపిలో ఆంక్షలు కొనసాగనున్నాయి.

Karnataka Schools : కర్ణాటకలో తెరుచుకున్న స్కూల్స్

Schools (1)

Schools reopened : కర్ణాటకలో పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. హిజాబ్ వివాదం కారణంగా మూతబడిన పాఠశాలలు ఇవాళ తిరిగి తెరుచుకున్నాయి. హిజాబ్ వివాదం నడుమ పదో తరగతి వరకు పాఠశాలలు తెరుచుకున్నాయి. అయితే కళాశాలలు, యూనివర్సిటీల రీఓపెనింగ్‌పై ఇంకా సందిగ్ధత వీడలేదు. హిజాబ్‌ వివాదం కారణంగా కర్ణాటకలో ఫిబ్రవరి 9 నుంచి పాఠశాలలు మూత పడినాయి.

ముందస్తు చర్యల్లో భాగంగా ఫిబ్రవరి 19 వరకు ఉడిపిలో అధికారులు 144 సెక్షన్‌ విధించారు. నేటి నుంచి ఫిబ్రవరి 19 సాయంత్రం 6 గంటల వరకు ఉడిపిలో ఆంక్షలు కొనసాగనున్నాయి. శివమొగ్గ జిల్లాలో ప్రాథమిక పాఠశాలల వద్ద 144 సెక్షన్ కొనసాగుతున్నాయి. ప్రీ యూనివర్సిటీ, డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీలను తెరిచే అంశంపై నేడు కర్ణాటక ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకొనున్నారు.

Drugs Case : టాలీవుడ్ డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు.. ఈడీకి కాల్ రికార్డింగ్స్‌ ఇవ్వని ఎక్సైజ్‌ శాఖ

స్కూళ్లు తిరిగి ప్రారంభంకావడంతో శాంతి నెలకొని, సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని ఆశిస్తున్నట్లు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఆశాభావం వ్యక్తం చేశారు. పరిస్థితిని కొద్దిరోజులపాటు పరిశీలించిన తర్వాత ప్రీ యూనివర్సిటీ, డిగ్రీ కళాశాలను తెరిచే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. పాఠశాలలు ప్రశాంతంగా నడుస్తాయనే నమ్మకంతో ఉన్నట్లు సీఎం బొమ్మై ధీమా వ్యక్తం చేశారు.

విద్యార్థుల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలను ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల అధికారులకు కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తరగతి గదుల్లో విద్యార్థులు హిజాబ్‌లు, స్కార్ఫ్‌లు, మతపరమైన వస్త్రాలు ధరించకుండా చూడాలని గత గురువారం ప్రభుత్వానికి కర్ణాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హిజాబ్‌ వ్యవహారంపై నేడు మరోసారి కర్ణాటక హైకోర్టు విచారణ జరుపనుంది.