Exports Of Onion: ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం నిజమేనా? క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి!

దేశంలో ఉల్లి ఎగుమతులపై ఎలాంటి నిషేధం లేదు. ఇండియా నుంచి ఏ దేశానికైనా ఎగుమతి చేయొచ్చు. ఈ విషయంలో తప్పుడు ప్రకటనలు వెలువడటం సరికాదు. అయితే, ఉల్లి విత్తనాల ఎగుమతులపై మాత్రమే నిషేధం ఉంది. గత జూలై-డిసెంబర్ మధ్య ఎగుమతులు బాగున్నాయి.

Onion

Exports Of Onion: ఉల్లి ఎగుమతులపై ప్రభుత్వం నిషేధం విధించింది అంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్రం స్పందించింది. ఈ విషయంలో స్పష్టతనిస్తూ ఒక ప్రకటన చేసింది. కేంద్రం ఉల్లి ఎగుమతులపై ఎలాంటి నిషేధం విధించలేదని స్పష్టం చేసింది.

Jammu and Kashmir: జమ్మూలో కాశ్మీర్ పండిట్ హత్య.. తుపాకులతో కాల్చిన తీవ్రవాదులు

ఈ అంశంపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఉల్లి ఎగుమతులపై ఎలాంటి నిషేధం లేదన్నారు. ‘‘దేశంలో ఉల్లి ఎగుమతులపై ఎలాంటి నిషేధం లేదు. ఇండియా నుంచి ఏ దేశానికైనా ఎగుమతి చేయొచ్చు. ఈ విషయంలో తప్పుడు ప్రకటనలు వెలువడటం సరికాదు. అయితే, ఉల్లి విత్తనాల ఎగుమతులపై మాత్రమే నిషేధం ఉంది. గత జూలై-డిసెంబర్ మధ్య ఎగుమతులు బాగున్నాయి. ప్రతి నెల సగటున 40 మిలియన్ డాలర్లకు మించిన ఎగుమతులే నమోదయ్యాయి.

Nikki Haley: శత్రు దేశాలకు సాయం నిలిపివేస్తాం.. పాక్, చైనాలకు కూడా: నిక్కీ హేలీ

గత డిసెంబరులో ఉల్లి ఎగుమతులు 50 శాతం పెరిగి, 52.1 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఏప్రిల్-డిసెంబర్ మధ్య ఎగుమతులు 16.3 శాతం పెరిగి, 523.8 మిలియన్ డాలర్లకు చేరాయి. ఇది అన్నదాతలకు ఎంతో మేలు చేసింది’’ అని పీయూష్ గోయల్ వెల్లడించారు. అయితే, కేంద్రం ఈ ప్రకటన చేయడానికి ప్రధాన కారణం.. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే శనివారం చేసిన ట్వీట్.  ‘‘వ్యవసాయానికి సంబంధించి ఉల్లి ఎగుమతులు-దిగుమతుల విషయంలో నిలకడ లేకపోవడం వల్ల మహారాష్ట్రలోని ఉల్లి రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. దేశీయ మార్కెట్లలో ధరల హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటున్నాయి’’ అని ఆమె ట్వీట్ చేశారు. ఉల్లి ఎగుమతులకు అనుమతించకపోవడం వల్లే రైతులు నష్టపోతున్నట్లు ఆమె పేర్కొన్నారు. దీంతో కేంద్రం స్పందించింది.