Nikki Haley: శత్రు దేశాలకు సాయం నిలిపివేస్తాం.. పాక్, చైనాలకు కూడా: నిక్కీ హేలీ

పాకిస్తాన్‌కు మిలిటరీ సాయం, చైనాకు వాతావరణ కాలుష్య నియంత్రణ చర్యల కింద.. ఇలా చాలా దేశాలకు కూడా అమెరికా సాయం అందిస్తుంది. అయితే, తాము అధికారంలోకి వస్తే ఆయా దేశాలకు అందించే సాయాన్ని ఆపేస్తామని నిక్కీ హేలీ ప్రకటించారు.

Nikki Haley: శత్రు దేశాలకు సాయం నిలిపివేస్తాం.. పాక్, చైనాలకు కూడా: నిక్కీ హేలీ

Nikki Haley: శత్రు దేశాలకు అమెరికా అందిస్తున్న ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తామని ప్రకటించారు అమెరికాకు చెందిన రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ. పాకిస్తాన్, చైనా వంటి దేశాలకు ఆర్థిక సాయం చేయడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. వివిధ అంశాల ప్రాతిపదికన అనేక దేశాలకు అమెరికా ఆర్థిక సాయం చేస్తుంటుంది.

Jammu and Kashmir: జమ్మూలో కాశ్మీర్ పండిట్ హత్య.. తుపాకులతో కాల్చిన తీవ్రవాదులు

పాకిస్తాన్‌కు మిలిటరీ సాయం, చైనాకు వాతావరణ కాలుష్య నియంత్రణ చర్యల కింద.. ఇలా చాలా దేశాలకు కూడా అమెరికా సాయం అందిస్తుంది. అయితే, తాము అధికారంలోకి వస్తే ఆయా దేశాలకు అందించే సాయాన్ని ఆపేస్తామని నిక్కీ హేలీ ప్రకటించారు. భారత సంతతి వ్యక్తి అయిన నిక్కీ.. రిపబ్లికన్ పార్టీ తరఫున రాబోయే అమెరికా అధ్యక్ష పదవి బరిలో నిలవబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శత్రు దేశాలకు అమెరికా సాయం చేయడాన్ని ఆమె తప్పుబట్టింది. గత అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుతం అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఆయా దేశాలకు సాయం అందించాలని నిర్ణయించారు.

Hit And Drag Case: స్కూటర్‌ను ఢీకొన్న ట్రక్కు.. వృద్ధుడు, ఆరేళ్ల బాలుడు మృతి.. బాలుడి మృతదేహాన్ని రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు

ఇటీవల బైడెన్.. పాకిస్తాన్‌కు మిలిటరీ సాయం అందించాలని నిర్ణయించారు. దీన్ని తాము అధికారంలోకి వస్తే అడ్డుకుంటామని తెలిపింది. ‘‘శత్రు దేశాలకు అమెరికా అందించే ప్రతి సెంట్ ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తాం. పాకిస్తాన్‌కు సైనిక సాయాన్ని, చైనాకు పర్యావరణ సాయాన్ని పునరుద్ధరిస్తూ బైడెన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని కూడా ఆపేస్తాం. అమెరికా ప్రజలు చెల్లించిన పన్నుల్ని ఆయా దేశాలకు ఇవ్వడం సరికాదు. ఇది ఒక్క జో బైడెన్ నిర్ణయం కాదు. దశాబ్దాలుగా రెండు పార్టీలకు చెందిన అధ్యక్షులు ఈ పని చేస్తున్నారు.

Rahul Gandhi: భారత్ జోడో యాత్రలో ఎంతో నేర్చుకున్నా.. కాశ్మీర్ యువతలో త్రివర్ణ పతాకంపై ప్రేమను నింపాం

అమెరికా అనుసరిస్తున్న విదేశాంగ విధానాలు గత పద్ధతుల్లోనే కొనసాగుతున్నాయి. మన దగ్గర సాయం పొందిన దేశాలు ఆ నిధుల్ని ఏం చేస్తున్నాయో చూడకుండానే మనం సాయం చేస్తున్నాం ’’ అని నిక్కీ హేలీ వ్యాఖ్యానించింది. గత ఏడాది అమెరికా ఇరాక్, పాకిస్తాన్, చైనా వంటి దేశాలకు 46 బిలియన్ డాలర్ల సాయాన్ని అందజేసింది.