Rahul Gandhi: భారత్ జోడో యాత్రలో ఎంతో నేర్చుకున్నా.. కాశ్మీర్ యువతలో త్రివర్ణ పతాకంపై ప్రేమను నింపాం

భారత్ జోడో యాత్రలో నేను చాలా నేర్చుకున్నానని, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నా దేశంకోసం నడిచానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా కాశ్మీర్ యువతలో త్రివర్ణ పతాకంపై ప్రేమను నింపామని, బీజేపీ దానిని దూరం చేసిందని రాహుల్ వ్యాఖ్యానించారు. మాకు, వాళ్లకు ఉన్న వ్యత్యాసం అదేనంటూ బీజేపీ పై విమర్శలు చేశారు.

Rahul Gandhi: భారత్ జోడో యాత్రలో ఎంతో నేర్చుకున్నా.. కాశ్మీర్ యువతలో త్రివర్ణ పతాకంపై ప్రేమను నింపాం

Rahul Gandhi

Rahul Gandhi: భారత్ జోడో యాత్రలో నేను చాలా నేర్చుకున్నానని, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నా దేశంకోసం నడిచానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్‌లో కాంగ్రెస్ 85వ ప్లీనరీ చివరిరోజైన ఆదివారం సదస్సును ఉద్దేశించి రాహుల్ ప్రసంగించారు. ఈసందర్భంగా భారత్ జోడో యాత్రలో తన అనుభవాలను పార్టీ శ్రేణులతో రాహుల్ పంచుకున్నారు. యాత్రలో నాకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు వేలాది మంది కనెక్ట్ అయ్యారని అన్నారు. రైతులు, అన్నివర్గాల ప్రజల సమస్యలను నేను విన్నానని, వారి బాధను తెలుసుకున్నానని రాహుల్ చెప్పారు. మహిళలు, యువత బాధను స్వయంగా తెలుసుకున్నానని అన్నారు. వర్షాలు, ఎండలను కూడా లెక్కచేయకుండా ఎంతో ఉత్సాహంగా యాత్రలో పాల్గొనడం జరిగిందని రాహుల్ చెప్పారు.

Rahul Gandhi: అదానీ విషయంలో నిజం బయటకొచ్చే వరకు ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం..

నేను కాలేజీలో ఫుట్ బాల్ ఆడుతున్నప్పుడు మోకాలిలో పాతగాయం ఉందని, భారత్ జోడో యాత్రలో పాల్గొన్నప్పుడు అది తిరగబెట్టిందని రాహుల్ చెప్పారు. పొద్దున్నే లేవగానే ఎలా బయల్దేరాలా అని ఆలోచించేవాడనని, అప్పుడు అనుకున్నది 25 కి.మీ మీటర్లు కాదు.. 3,500 కి.మీ అని  నేను గుర్తుచేసుకొనేవాడినని రాహుల్ చెప్పారు. నేను కంటైనర్ నుంచి దిగినతరువాత నడవడం మొదలు పెట్టడం, కార్యకర్తలను, ప్రజలను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకోవటం ప్రారంభమైన తరువాత నాకు పాదయాత్ర భారంగా అనిపించలేదని రాహుల్ అన్నారు. మొదటి 10 నుంచి 15 రోజుల్లో కొంచెం కష్టంగా అనిపించినా తరువాత ఎంతో ఉత్సాహంగా యాత్రలో పాల్గొనడం జరిగిందని అన్నారు.

Rahul Gandhi: నానమ్మకు నేనంటే ఇష్టం.. ఇటాలియన్ అమ్మమ్మకు ప్రియాంక అంటే ఇష్టం: రాహుల్

భారత్ జోడో యాత్ర ద్వారా కాశ్మీర్ యువతలో త్రివర్ణ పతాకంపై ప్రేమను నింపామని, బీజేపీ దానిని దూరం చేసిందని రాహుల్ వ్యాఖ్యానించారు. మాకు, వాళ్లకు ఉన్న వ్యత్యాసం అదేనంటూ బీజేపీ పై రాహుల్ విమర్శలు చేశారు. బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం విద్వేష ప్రచారం ద్వారా దేశాన్ని ధ్వంసం చేస్తోందని రాహుల్ ఆరోపించారు. భారత్ జోడో యాత్రలో చివరిగా జమ్మూ కశ్మీర్ లో తాను అడుగు పెట్టినప్పుడు ముఖ్యంగా యువత ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చి కశ్మీర్ లో పర్యటించినందుకు తనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారని రాహుల్ గుర్తు చేశారు. కశ్మీర్ లో మతం పేరుతో యువత వివక్షకు గురువుతోందంటూ రాహుల్ ఆరోపించారు.