Rahul Gandhi: అదానీ విషయంలో నిజం బయటకొచ్చే వరకు ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం..

ప్రధాని నరేంద్ర మోదీ, గౌతమ్ అదానీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నేను పార్లమెంట్‌లో గౌతమ్ అదానీని విమర్శించాను. ప్రధాన మంత్రితో అతనికి సంబంధం ఏమిటని ప్రశ్నించాను. నేను ప్రశ్నలు లేవనెత్తిన వెంటనే కేంద్ర మంత్రులు వ్యాపారవేత్తకు రక్షణగా నిలుస్తూ మాట్లాడారు. అలాఅని వదిలే ప్రసక్తే లేదు. అదానీ విషయంలో నిజం బయటకు వచ్చే వరకు ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం అని రాహుల్ గాంధీ అన్నారు.

Rahul Gandhi: అదానీ విషయంలో నిజం బయటకొచ్చే వరకు ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం..

Rahul Gandhi

Rahul Gandhi: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ విషయంలో నిజాలు బయటకు వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ తరపున అధికార పార్టీని పార్లమెంట్ లో ప్రశ్నిస్తూనే ఉంటామని కాంగ్రెస్ పార్టీ ఎంపీ, సీనియర్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ 84వ జాతీయ మహాసభల్లో భాగంగా చివరిరోజు రాహుల్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, గౌతమ్ అదానీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నేను పార్లమెంట్‌లో గౌతమ్ అదానీని విమర్శించాను. ప్రధాన మంత్రితో అతనికి సంబంధం ఏమిటని ప్రశ్నించాను  నేను ప్రశ్నలు లేవనెత్తిన వెంటనే కేంద్ర మంత్రులు వ్యాపారవేత్తకు రక్షణగా నిలుస్తూ మాట్లాడారు. అలాఅని వదిలే ప్రసక్తే లేదు. అదానీ విషయంలో నిజం బయటకు వచ్చే వరకు ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం అని రాహుల్ గాంధీ అన్నారు.

Rahul Gandhi: నానమ్మకు నేనంటే ఇష్టం.. ఇటాలియన్ అమ్మమ్మకు ప్రియాంక అంటే ఇష్టం: రాహుల్

బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు అదానీని రక్షించాలని ఎందుకు భావిస్తున్నాయని రాహుల్ ప్రశ్నించారు. పార్లమెంట్ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నా, కేంద్రం ఎందుకు జేపీసీ వేయడం లేదని రాహుల్ నిలదీశారు. షెల్ కంపెనీలపై ఎందుకు విచారణ చేయడం లేదో కేంద్రం చెప్పాలన్నారు. అదానీ, మోదీ ఒక్కటేనని, దేశ సంపద అంతా ఒక్కరి చేతుల్లోకి వెళ్తుందని రాహుల్ ఆరోపించారు. స్వాతంత్ర్య పోరాటం కూడా ఓ కంపెనీ (ఈస్టిండియా కంపెనీ)కి వ్యతిరేకంగా సాగిందని, ఇప్పుడు చరిత్ర పునరావృతమవడాన్ని మనం చూస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పోరాడుతుందని, ఈ పార్టీ సన్యాసుల పార్టీ అని, పూజారుల పార్టీ కాదంటూ రాహుల్ పేర్కొన్నారు.

Rahul Gandhi : గుల్మార్గ్‌లో మంచుపై స్కీయింగ్‌ చేస్తూ..ఎంజాయ్‌ చేస్తున్న రాహుల్‌ గాంధీ

విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యలను రాహుల్ తీవ్రంగా ఖండించారు. చైనా ఆర్థిక వ్యవస్థ మనకంటే పెద్దది, వారితో ఎలా పోరాడగలం అని మంత్రి అనడం జాతీయవాదం కాదు.. పిరికితనం అంటూ రాహుల్ అన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా నేను చాలా నేర్చుకున్నానని రాహుల్ తెలిపారు. కశ్మీర్‌లో భారత్ జోడో యాత్రకు ఎంతో ప్రేమ లభించిందని రాహుల్ తెలిపారు. జమ్మూ కశ్మీర్ యువతలో త్రివర్ణ పతాక స్ఫూర్తిని, హిందుస్థాన్ స్ఫూర్తిని నింపామని, కానీ, ప్రధాని జమ్మూ కశ్మీర్ యువత నుంచి జెండా స్ఫూర్తిని దూరం చేశారని రాహుల్ విమర్శించారు. ఇదే మాకు, మీకు తేడా అంటూ ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ విమర్శలు చేశారు.