Rahul Gandhi: నానమ్మకు నేనంటే ఇష్టం.. ఇటాలియన్ అమ్మమ్మకు ప్రియాంక అంటే ఇష్టం: రాహుల్

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. తాజాగా, ఓ ఇటాలియన్ మీడియాకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. నానమ్మ, అమ్మమ్మకు రాహుల్, ప్రియాంకలో ఎవరు ఇష్టమన్న అంశంపై ఆయన స్పందించారు. తమ నానమ్మ, భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి తాను అంటే బాగా ఇష్టమని, తమ అమ్మమ్మ, ఇటాలియన్ పోలా మైనోకు తన సోదరి ప్రియాంకా గాంధీకి అంటే చాలా ఇష్టమని చెప్పారు.

Rahul Gandhi: నానమ్మకు నేనంటే ఇష్టం.. ఇటాలియన్ అమ్మమ్మకు ప్రియాంక అంటే ఇష్టం: రాహుల్

Rahul Gandhi's Kaurava dig

Updated On : February 21, 2023 / 8:35 PM IST

Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. తాజాగా, ఓ ఇటాలియన్ మీడియాకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. నానమ్మ, అమ్మమ్మకు రాహుల్, ప్రియాంకలో ఎవరు ఇష్టమన్న అంశంపై ఆయన స్పందించారు. తమ నానమ్మ, భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి తాను అంటే బాగా ఇష్టమని, తమ అమ్మమ్మ, ఇటాలియన్ పోలా మైనోకు తన సోదరి ప్రియాంకా గాంధీకి అంటే చాలా ఇష్టమని చెప్పారు.

తన అమ్మమ్మ 98 ఏళ్లు నివసించిందని, ఆమెతో తనకు గొప్ప అనుబంధం ఉందని రాహుల్ తెలిపారు. కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ తల్లి పోలా మైనో గత ఏడాది ఆగస్టులో కన్నుమూశారు. ఇప్పటివరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదని రాహుల్ ను జర్నలిస్టు ప్రశ్నించారు. అందుకు రాహుల్ సమాధానం చెబుతూ.. “ఇదో వింత.. నాకు తెలియదు. నేను చాలా పనులు చేయాల్సి ఉంది” అని చెప్పారు. అయితే, తనకు పిల్లలు ఉంటే బాగుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు.

గడ్డం ఎందుకు పెంచుకున్నారని జర్నలిస్ట్ అడిగారు. దీంతో రాహుల్ స్పందిస్తూ… భారత్ జోడో యాత్ర పూర్తయ్యే వరకు గడ్డం తీయొద్దని అనుకున్నానని, అయితే, ఇప్పుడు గడ్డం అలాగే ఉంచుకోవాలా? లేదా? తీసేయాలా? అన్న విషయంపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. భారత్ లో కేంద్ర ప్రభుత్వం నిరంకుశత్వంతో వ్యవహరిస్తోందని అన్నారు. విపక్షాలు ఏకమైతే వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఓడిపోవడం ఖాయమని చెప్పారు.

CM Nitish Kumar: ఇదేమైనా ఇంగ్లండ్ అనుకున్నావా? ఇంగ్లీష్‌లో మాట్లాడిన అధికారిపై బిహార్ సీఎం నితీష్ కుమార్ ఆగ్రహం