కోల్‌కతా డాక్టర్ కేసులో అసలేం జరిగింది? కనిపించే దేవుళ్లకు భద్రత ఏది?

నిర్భయ, దిశ లాంటి చట్టాలు వచ్చినా అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. మహిళలను ఈ భయం ఇంకెన్నాళ్లు వెంటాడుతుంది? శారీరక దాడులు తప్పేది ఎప్పుడు? మహిళలకు గాంధీజీ కలలుకన్న స్వాతంత్ర్యం రానట్లేనా?

Kolkata Junior Doctor Incident : మనిషి రూపంలో ఉండే దేవుడే వైద్యుడు. అందుకే వైద్యో నారాయణో హరి అంటారు. కానీ మానవత్వం మంటగలిసి కనికరం అన్నదే లేకుండా.. అమానుషమే నీడలా వెంటాడి లేడీ డాక్టర్ల ప్రాణాలు తీస్తోంది. ప్రాణదాతల మాన ప్రాణాలకు భద్రత కరువైంది. సేఫ్టీ, సెక్యూరిటీ లేక ప్రతి క్షణం టెన్షన్ టెన్షన్ గా ఒత్తిడిలో డ్యూటీ చేస్తున్నారు లేడీ డాక్టర్లు. కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసు దేశాన్ని కుదిపేస్తోంది. ఆందోళనలు ఓవైపు, డాక్టర్ల సమ్మె మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతున్నాయి. కోల్ కతా డాక్టర్ కేసు సామూహిక హత్యాచారమా? సీబీఐ విచారణలో అసలు విషయాలు వెలుగులోకి వస్తాయా? అసలేం జరిగింది?

ఆదివారాలు లేవు. ఆనందాలు అంతకన్నా లేవు. పర్సనల్ లైఫ్ మాటే లేదు. పేషెంట్ ప్రాణాలు కాపాడటమే విధి. వైద్య వృత్తిని చాలా పవిత్రంగా భావించే డాక్టర్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మెంటల్ ప్రజర్, సేఫ్టీ, సెక్యూరిటీ వంటి సమస్యలు ఉన్నా.. వైద్య వృత్తిలోకి మహిళలు ఎక్కువగా వస్తున్నారు. అలా వృత్తిని నమ్మి ప్రాణాలను నిలబెట్టే ప్రాణదాతల ప్రాణాలకే రక్షణ లేకుండా పోతోంది. లేడీ డాక్టర్లకే కాదు మహిళలకు భద్రత కరువైపోయింది. నిర్భయ, దిశ లాంటి చట్టాలు వచ్చినా అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. మహిళలను ఈ భయం ఇంకెన్నాళ్లు వెంటాడుతుంది? శారీరక దాడులు తప్పేది ఎప్పుడు? మహిళలకు గాంధీజీ కలలుకన్న స్వాతంత్ర్యం రానట్లేనా?

Also Read : పాక్‌ అండతో రెచ్చిపోతున్న ఉగ్రవాద గుంపులు.. అసెంబ్లీ ఎన్నికల ముందు అలజడి సృష్టించే ప్లాన్

ట్రెండింగ్ వార్తలు