Vaccine Schedule: పేమెంట్ చేసినా వ్యాక్సిన్ ఎప్పుడు పంపుతారో చెప్పడం లేదు

పంజాబ్ గవర్నమెంట్ వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా తమ రాష్ట్రానికి రావాలంటూ సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు రూ.10.37కోట్లు ...

Vaccine Schedule: పేమెంట్ చేసినా వ్యాక్సిన్ ఎప్పుడు పంపుతారో చెప్పడం లేదు

Vaccine Schedule

Updated On : May 6, 2021 / 10:19 AM IST

Vaccine Schedule: పంజాబ్ గవర్నమెంట్ వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా తమ రాష్ట్రానికి రావాలంటూ సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు రూ.10.37కోట్లు చెల్లించింది. 30లక్షల యాంటీ కొవిడ్ వ్యాక్సిన్ పంపుతారని ఎదురుచూస్తుంటే దాని ఊసే లేదు. పంపిస్తామని ఎటువంటి డేట్ కూడా చెప్పకపోవడం గమనార్హం.

పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ జరగ్గా అందులో దీనిపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 30లక్షల డోసుల కోసం ఏప్రిల్ 26ననే రూ.10.37కోట్లు బదిలీ చేశారు. అవి అందాయి కానీ, సప్లై గురించి ఎటువంటి షెడ్యూల్ ను ఇవ్వలేదని హెల్త్ సెక్రటరీ హసన్ లాల్ రాష్ట్ర క్యాబినెట్ కు తెలియజేశారు.

యాంటీ కరోనావైరస్ డోసుల కొరత కారణంగా 18నుంచి 44ఏళ్ల మధ్య వయస్సున్న వారికి వ్యాక్సినేషన్ ఇంకా మొదలుపెట్టలేదు. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ డైరక్ట్ గా ఆర్డర్ అందుకున్నవి మాత్రమే 18ఏళ్లు అంత కంటే ఎక్కువ వయస్సున్న వారికి వ్యాక్సిన్ ఇస్తున్నాయని మీటింగ్ లో బయటికొచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాక్సిన్ రెడీ కావాలంటే నాలుగు వారాల వరకూ పడుతుందని చెప్పింది సీరం సంస్థ.