Women Safety: “రాత్రి 7గంటల తర్వాత మహిళలు పనిచేయాలనే బలవంతం లేదు”

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహిళా కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది. మే27న ఇష్యూ చేసిన అంశంలో ఉదయం 6గంటల కంటే ముందు రాత్రి 7గంటల తర్వాత పనిచేయాలంటూ ఎటువంటి ఒత్తిడి చేయకూడదని స్పష్టం చేసింది.

Women Safety: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహిళా కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది. మే27న ఇష్యూ చేసిన అంశంలో ఉదయం 6గంటల కంటే ముందు రాత్రి 7గంటల తర్వాత పనిచేయాలంటూ ఎటువంటి ఒత్తిడి చేయకూడదని స్పష్టం చేసింది. దాంతో పాటుగా ఎవరైనా మహిళ నైట్ షిఫ్ట్ చేయడానికి ఇష్టపడితే అటువంటి వారికి కంపెనీనే ఫ్రీ ట్రాన్స్‌పోర్ట్, ఫ్రీ ఫుడ్ సప్లై చేయాలని చెప్పింది.

నోటీసు ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లోని కర్మాగారాలు పాటించాల్సిన నియమాలు

1. వ్రాతపూర్వక అనుమతి లేకుండా రాత్రి 7 నుండి ఉదయం 6 గంటల మధ్య పని చేయమని ఏ మహిళపై ఒత్తిడి తీసుకురాకూడదు.

2. ఏ మహిళ అయినా అలాంటి సమయాల్లో పని చేయడానికి నిరాకరించినట్లయితే ఉద్యోగం నుండి తొలగించడానికి వీల్లేదు.

3. సాయంత్రం 7, ఉదయం 6 గంటల మధ్య పనిచేసే మహిళలకు పని చేసే ప్రదేశానికి తిరిగి రావడానికి రవాణా సౌకర్యం కల్పిస్తారు.

4. సాయంత్రం 7 ఉదయం 6 గంటల మధ్య పనిచేసే మహిళలకు ఆహారం, తగిన పర్యవేక్షణ అందించబడుతుంది.

5. వాష్‌రూమ్‌లు, డ్రింకింగ్ సదుపాయాలు, దుస్తులు మార్చుకునే గదులు ఏర్పాటు చేయాలి.

6. సాయంత్రం 7 నుండి ఉదయం 6 గంటల మధ్య కనీసం నలుగురు మహిళలు కలిసి ఆవరణలో పని చేయాలి.

7. లైంగిక వేధింపుల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలి.

Read Also : నైట్ కర్ఫ్యూ ఎత్తివేత.. యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తాజా నివేదిక ప్రకారం, భారతదేశంలోని 15-49 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళల కంటే మూడు రెట్లు ఎక్కువ మంది పురుషులు ఉన్నారు. శ్రామిక మహిళల శాతం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో బీహార్ (14 శాతం), ఉత్తరప్రదేశ్ (17 శాతం), అస్సాం (18 శాతం) ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు