Night Curfew : నైట్ కర్ఫ్యూ ఎత్తివేత.. యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

కరోనా కేసుల నమోదు భారీగా తగ్గడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ ఎత్తివేసింది.

Night Curfew : నైట్ కర్ఫ్యూ ఎత్తివేత.. యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Night Curfew

Night Curfew : కరోనా కేసుల నమోదు భారీగా తగ్గడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ ఎత్తివేసింది. ఒమిక్రాన్ భయాందోళనలతో గతేడాది డిసెంబర్ లో యూపీలో నైట్ కర్ఫ్యూ విధించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు జనసంచారంపై ఆంక్షలు అమలు చేశారు. కొన్ని రోజులుగా పాజిటివిటీ రేటు తగ్గడం, కేసులు సంఖ్య గణనీయంగా క్షీణించడంతో నైట్ కర్ఫ్యూ ఎత్తివేసింది యూపీ సర్కార్.

క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గిన నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు యూపీ హోంశాఖ అద‌న‌పు కార్య‌ద‌ర్శి అవాస్తి తెలిపారు. గ‌డిచిన 24 గంట‌ల్లో యూపీలో కొత్త‌గా 842 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా త‌గ్గింది. గ‌త వారం 15వేల ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పుడు 8వేల‌కు ప‌డిపోయింది.

India Corona : దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..!

దేశంలో రోజురోజుకూ కరోనా కొత్త కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ముందురోజు 25 వేలకు దిగొచ్చిన కొత్త కేసులు.. తాజాగా 22,270కి పడిపోయాయి. శుక్రవారం 12 లక్షల మందికి కరోనా పరీక్షలు చేశారు. పాజిటివిటీ రేటు రెండు శాతం(1.8 శాతం) దిగువకు చేరి ఊరటనిస్తోంది. శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ ఈ గణాంకాలు తెలిపింది.

Night Curfew Up

Night Curfew Up

కొవిడ్ వ్యాప్తి కట్టడిలో ఉండటంతో యాక్టివ్ కేసులు 2.5 లక్షలకు తగ్గాయి. ఆ కేసుల రేటు 0.59 శాతానికి క్షీణించింది. నిన్న ఒక్కరోజే 60 వేల మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ 4.28 కోట్ల మందికి కరోనా సోకగా.. 4.20 కోట్ల మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం రికవరీ రేటు 98.12 శాతానికి చేరింది. 24 గంటల వ్యవధిలో 325 మంది ప్రాణాలు కోల్పోయారు. ముందురోజు కంటే మరణాల సంఖ్య(492)లో తగ్గుదల కనిపించింది. మొత్తంగా 5,11,230 మంది కోవిడ్ తో చనిపోయారు.

గతేడాది జనవరి నుంచి దేశంలో కరోనా టీకా కార్యక్రమం నిర్విరామంగా సాగుతోంది. అప్పటినుంచి 175 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. అలాగే దేశంలో 80 శాతం మంది వయోజనులు రెండు డోసుల టీకా తీసుకున్నారని, 100 శాతం వ్యాక్సినేషన్ దిశగా దేశం పయనిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం 36 లక్షల మందికి పైగా టీకా వేయించుకున్నారు.

Covid Deaths Feb : ఈ నెలలో 15వేలు దాటిన కరోనా మరణాలు.. జూలై నుంచి ఇదే అత్యధికం..!

దేశంలో కరోనా కేసుల కొండ కరుగుతోంది. ఫస్ట్, సెకండ్ వేవ్‌తో పోల్చినప్పుడు థర్డ్ వేవ్ లో కేసులు ఎంత వేగంగా పెరిగాయో.. ఇప్పుడు అదే స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. కేవలం మూడు వారాల్లోనే 3 లక్షల స్థాయి నుంచి 30 వేల స్థాయికి కేసులు పడిపోయాయి. దీంతో రాష్ట్రాలు సైతం ఆంక్షలు సడలిస్తున్నాయి. ఫలితంగా దేశ వ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.

కొవిడ్‌ ఫస్ట్ వేవ్ లో లాక్‌డౌన్‌ పరిస్థితులు, సెకండ్‌ వేవ్‌లో ఆక్సిజన్‌ కొరత, భారీ మరణాలు దేశాన్ని అతలాకుతలం చేశాయి. దీంతో దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌.. మరోసారి ప్రజలను ఆందోళనకు గురిచేసింది. వేగంగా వ్యాప్తి చెందే లక్షణం కలిగిన ఈ వేరియంట్‌.. అధిక జనసాంద్రత కలిగిన మన దేశంలో ప్రవేశిస్తే ఏంటన్న ప్రశ్నలు నిద్రలేకుండా చేశాయి. ఆ భయాలు కొనసాగుతున్న వేళ డిసెంబర్‌ మొదటి వారంలో ఒమిక్రాన్‌ తొలి కేసు దేశంలో నమోదైంది. అదే నెల చివరి నుంచి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 10 వేల స్థాయి నుంచి క్రమంగా పెరగడం మొదలైంది.

Up Night Curfew

Up Night Curfew

జనవరి 1 నాటికి 22 వేలుగా రోజువారీ కేసుల సంఖ్య ఉండగా.. వారానికే లక్ష, రెండు వారాలకే రెండు లక్షల స్థాయిని దాటింది. జనవరి 20 నాటికి మూడు లక్షల కేసులు నమోదయ్యాయి. జనవరి 24న గరిష్ఠంగా 3.47 లక్షల కేసులు నమోదయ్యాయి. అక్కడి నుంచి క్రమంగా కేసులు తగ్గడం మొదలైంది. జనవరి 31 నాటికి 2 లక్షలకు పైగా ఉన్న కేసుల సంఖ్య ఫిబ్రవరి 1 వచ్చే సరికి 1.67 లక్షలకు చేరింది. ఫిబ్రవరి 14న కేంద్ర ప్రభుత్వం తెలిపిన గణాంకాల ప్రకారం ఆ సంఖ్య 34,113కు చేరింది.

తొలి రెండు వేవ్‌ల సమయంలో దేశమంతా ఆంక్షల చట్రంలో చిక్కుకుంది. అయితే, థర్డ్ వేవ్‌ సమయంలో కేవలం నైట్‌ కర్ఫ్యూలు, విద్యా సంస్థల బంద్‌, థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్యపై ఆంక్షలు, సభలు, సమావేశాలపై నిషేధం వంటివి మించితే పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ విధించలేదు. ప్రస్తుతం కొవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రాలు ఆంక్షలు సడలిస్తున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో నైట్‌ కర్ఫ్యూ ఎత్తివేశారు. విద్యా సంస్థలు తెరుచుకున్నాయి.