Viral Video: ఉద్యోగులకు పనిష్మెంట్‌.. ఆఫీసులో అరగంటసేపు నిలబెట్టిన సీఈవో

మొత్తం 16 మంది ఉద్యోగులు 30 నిమిషాల పాటు వారి డెస్కుల వద్ద నిలబడ్డారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు ఎంతో నిర్లక్ష్యంగా పనిచేస్తుంటారు. వృద్ధులను క్యూలైన్లలో నిలబెడుతూ వారి బాధలను పట్టించుకోరు. కస్టమర్లకు సరైన సేవలు అందించకుండా ఆఫీసుల్లో పర్సనల్ పనులు చేసుకునేవారు చాలా మంది ఉంటారు.

అటువంటి ఉద్యోగులకు ఓ బాస్ ఇచ్చిన పనిష్మెంట్‌కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నోయిడా అథారిటీకి సంబంధించిన కార్యాలయంలో పని ఉండి ఓ వృద్ధుడు వచ్చాడు. చిన్నపనికి అతడిని చాలా సేపు ఆఫీసు వద్దే నిలబెట్టారు ఉద్యోగులు.

ఈ విషయం గురించి తెలుసుకున్న నోయిడా అథారిటీ సీఈఓ లోకేశ్ ఉద్యోగులను అరగంటసేపు ఆఫీసులోనే నిలబెట్టారు. ఈ సమయంలో ఒకరు ఈ వీడియోను తీశారు. మొత్తం 16 మంది ఉద్యోగులు 30 నిమిషాల పాటు వారి డెస్కుల వద్ద నిలబడ్డారు.

ఉద్యోగులకు సీఈవో విధించిన శిక్షపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అన్ని కార్యాలయాల్లో ఇలాగే ఉద్యోగుల బద్ధకాన్ని వదిలిస్తే దేశం బాగుపడుతుందని కామెంట్లు చేస్తున్నారు. సామాన్యుల కష్టాలను పట్టించుకోని ఉద్యోగులను ఉద్యోగాల్లో నుంచి తొలగించాలని కొందరు కామెంట్లు చేశారు.

టీడీపీ కార్యక్రమాల్లో చొరబడి చిల్లర పనులు చేయటం వైసీపీ నేతలకు మొదటి నుంచీ అలవాటే: పార్థసారథి