OYO Hotels: ఓయో హోటళ్ల విషయంలో నోయిడా పోలీసులు కఠిన ఆదేశాలు జారీ చేశారు. భద్రతా చర్యలను పటిష్టం చేయడానికి హోటళ్లలో అధిక నాణ్యత గల సీసీటీవీలను అమర్చాలని ఓయో హోటల్ యాజమాన్యాన్ని పోలీసులు ఆదేశించారు. ఈ సీసీటీవీ కెమెరాలు కనీసం ఒక నెల పాటు రికార్డింగ్‌ను అందుబాటులో ఉంచుతాయి. ఇక తాజా ఆదేశాల్లో ప్రధానమైనది ఏంటంటే.. ఎవరైనా తక్కువ వయస్సు గల బాలిక మధ్యవయస్కుడితో కలిసి హోటల్‌కు వస్తే వెంటనే ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు ఆదేశించారు. హోటళ్లలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
హోటళ్లలో ‘అనైతిక కార్యకలాపాలు’ అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఏ మైనర్‌కు గదులు ఇవ్వకూడదని పోలీసులు ఓయోను ఆదేశించారు. దీంతో పాటు హోటళ్లకు వచ్చే వారి పూర్తి వివరాలు తీసుకోవాల్సి ఉంటుంది. హోటళ్లలో పోలీసు అధికారుల జాబితా, స్థానిక పోలీస్ స్టేషన్లు, హెల్ప్‌లైన్ నంబర్లు ఉండాలి. దీంతో పాటు రోడ్డు పక్కన హోటల్ గేటు బయట రెండు నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
వాస్తవానికి OYO కింద గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో (నోయిడా, గ్రేటర్ నోయిడా) 365 హోటళ్లు ఉన్నాయి. వీటిలో ప్రీమియం టౌన్‌హౌస్‌లు కూడా ఉన్నాయి. ఓయో హోటళ్లలో అక్రమ పనులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే పోలీసుల ప్రథమ ప్రాధాన్యత అని పోలీసులు చెబుతున్నారు. హోటళ్లు తమ ప్రాంగణాల్లో భద్రతను పెంచాలని పోలీసులు చెప్పారు.