Non-bailable warrant against Sanjay Raut, not appearing in this case
Sanjay Raut: మనీ లాండరింగ్ కేసులో జైలుకు వెళ్లి కొద్ది రోజుల క్రితమే బెయిలుపై విడుదలైన శివసేన (ఉద్ధవ్) సీనియర్ నేత సంజయ్ రౌత్‌కు మరో షాక్ తగిలింది. తాజాగా మరో కేసులో ఆయనకు బెయిల్ కూడా పొందే వీలు లేకుండా అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. భారతీయ జనతా పార్టీపై గతంలో సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యల ఫలితం ఇది. తప్పుడు ఆరోపణలు చేశారంటూ వారు కోర్టుకు ఎక్కారు. అయితే కోర్టు విచారణకు రౌత్ రాకపోవడంతో తాజా వారెంట్లు జారీ అయ్యాయి.
ముంబై సమీపంలోని మీరీ భయేందర్‌లో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం, నిర్వహణకు సంబంధించి బీజేపీ నేత కీర్తి సోమయ్య, మేథా సోమయ్య 100 కోట్ల రూపాయల స్కామ్‌కు పాల్పడ్డారంటూ సంజయ్ రౌత్ గతంలో ఆరోపించారు. దీనిపై కీర్తి సోమయ్య భార్య మేథా సోమయ్య పరువునష్టం కేసు వేశారు. అయితే కోర్టు ఆదేశించినప్పటికీ రౌత్ విచారణకు హాజరుకాలేదు. దీంతో సెవ్రి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ శుక్రవారం ఈ వారెంట్లు జారీ చేసింది.
CJI: ఇద్దరు కుమార్తెలను సుప్రీంకోర్టుకు తీసుకువచ్చి, తన పని గురించి వివరించిన సీజేఐ
ఫిర్యాదుదారుడి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన అనంతరం వారెంట్ జారీ చేసిన సెవ్రీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్, తదుపరి విచారణను జనవరి 24కి వాయిదా వేసింది. కోర్టు ఆదేశం తర్వాత కూడా రౌత్ హాజరుకాలేదని మేథా సోమయ్య తరపు న్యాయవాది వాదించారు. రౌత్‌కు జూలై 2022లోనే మజ్‌గావ్‌లోని మెట్రోపాలిటన్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.