KTR meets Satya Nadella: సత్య నాదెళ్లతో కేటీఆర్ భేటీ.. వ్యాపారం, బిర్యానీ గురించి చర్చించుకున్నామన్న మంత్రి

మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్లతో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కేటీఆర్ పోస్ట్ చేశారు. ఇద్దరు హైదరాబాదీలం కలిశామని, నేటి రోజు తాను ఈ విధంగా ప్రారంభించడం శుభపరిణామమని పేర్కొన్నారు. తాము వ్యాపారం, బిర్యానీ గురించి చర్చించుకున్నామని చెప్పారు.

KTR meets Satya Nadella: సత్య నాదెళ్లతో కేటీఆర్ భేటీ.. వ్యాపారం, బిర్యానీ గురించి చర్చించుకున్నామన్న మంత్రి

KTR meets Satya Nadella

Updated On : January 6, 2023 / 5:49 PM IST

KTR meets Satya Nadella: మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్లతో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కేటీఆర్ పోస్ట్ చేశారు. ఇద్దరు హైదరాబాదీలం కలిశామని, నేటి రోజు తాను ఈ విధంగా ప్రారంభించడం శుభపరిణామమని పేర్కొన్నారు. తాము వ్యాపారం, బిర్యానీ గురించి చర్చించుకున్నామని చెప్పారు.

హైదరాబాద్ బిర్యానీ ఎంత ప్రసిద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. అందుకే బిర్యానీ గురించి కూడా మాట్లాడుకున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. కాగా, తెలంగాణ ఐటీ, దాని అనుబంధ రంగాల్లో సర్కారు 2014 నుంచి ఇప్పటివరకు రూ.3.3 కోట్ల పెట్టుబడులను రాబట్టింది. సత్యనాదెళ్ల భారత్ పర్యటనలో భాగంగా ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలిశారు.

సత్య నాదెళ్ల భారత్ లో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వచ్చారు. డిజిటల్ ఇండియా కోసం కృషి చేస్తోన్న కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశంసించారు. ప్రధాని మోదీతో కూడా సత్య నాదెళ్ల ఆ అంశాలపైనే ప్రధానంగా చర్చించారు. భారత్ లో డేటా కేంద్రాల ఏర్పాటు కోసం పెట్టుబడులు పెడుతున్నామని సత్య నాదెళ్ల అన్నారు.

Bomb hoax: స్కూల్లో బాంబు పెట్టామని ఈ-మెయిల్ పంపి అందరినీ పరుగులు పెట్టించిన వ్యక్తి