Bomb hoax: స్కూల్లో బాంబు పెట్టామని ఈ-మెయిల్ పంపి అందరినీ పరుగులు పెట్టించిన వ్యక్తి

స్కూల్లో బాంబు పెట్టామని ఈ-మెయిల్ పంపి ఆ పాఠశాల అధికారులను, పోలీసులను పరుగులు పెట్టించాడు గుర్తు తెలియని వ్యక్తి. బడి వద్దకు బాంబు స్క్వాడ్ తో వచ్చిన పోలీసులు అక్కడ బాంబు లేదని, తమకు ఎవరో నకిలీ ఈ-మెయిల్ పంపారని తేల్చారు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులోని బసవేశ్వర నగర్ లో చోటుచేసుకుంది.

Bomb hoax: స్కూల్లో బాంబు పెట్టామని ఈ-మెయిల్ పంపి అందరినీ పరుగులు పెట్టించిన వ్యక్తి

Bomb hoax

Bomb hoax: స్కూల్లో బాంబు పెట్టామని ఈ-మెయిల్ పంపి ఆ పాఠశాల అధికారులను, పోలీసులను పరుగులు పెట్టించాడు గుర్తు తెలియని వ్యక్తి. బడి వద్దకు బాంబు స్క్వాడ్ తో వచ్చిన పోలీసులు అక్కడ బాంబు లేదని, తమకు ఎవరో నకిలీ ఈ-మెయిల్ పంపారని తేల్చారు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులోని బసవేశ్వర నగర్ లో చోటుచేసుకుంది.

పాఠశాలలో బాంబు పెట్టామంటూ ఆ స్కూలుకే ఒకరు ఈ-మెయిల్ పంపారు. ఆ ఈ-మెయిల్ చూసిన పాఠశాల అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. బాంబు నిర్వీర్యం చేసే బృందాలు, జాగిలాలతో పోలీసులు వెంటనే బడి వద్దకు చేరుకున్నారు. బాంబు కోసం స్కూల్ అంతటా గాలించారు.

ఆ సమయంలో పిల్లలు అందరినీ తరగతి గదుల నుంచి వేరే ప్రాంతానికి తరలించామని పోలీసు అధికారులు చెప్పారు. బడి పరిసరాల్లో ఎక్కడా బాంబు లేదని తేల్చినట్లు పోలీసులు తెలిపారు. ఆ ఈ-మెయిల్ ఎవరు పంపారన్న విషయం గురించి దర్యాప్తు ప్రారంభించామని అన్నారు.

Telangana : టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారినా మా జెండా,అజెండా,డీఎన్ఏ మారదు : కేటీఆర్