Telangana : టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారినా మా జెండా,అజెండా,డీఎన్ఏ మారదు : కేటీఆర్

కేంద్ర ప్రభుత్వంపై మంత్రికేటీఆర్ మారోసారి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. సూర్యాపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ కేంద్రం తెలంగాణాకు ఇచ్చిన నిధుల విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసురుతూ ‘టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారినా మా జెండా,అజెండా, డీఎన్ఏ మారదు అంటూ స్పష్టంచేశారు కేటీఆర్.

Telangana : టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారినా మా జెండా,అజెండా,డీఎన్ఏ మారదు : కేటీఆర్

Telangana :  కేంద్ర ప్రభుత్వంపై మంత్రికేటీఆర్ మారోసారి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. సూర్యాపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ కేంద్రం తెలంగాణాకు ఇచ్చిన నిధుల విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసురుతూ ‘టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారినా మా జెండా,అజెండా, డీఎన్ఏ మారదు అంటూ స్పష్టంచేశారు కేటీఆర్. కేంద్రానికి తెలంగాణ రూ.3లక్షల 68వేల కోట్ల పన్నులు చెల్లించామని కానీ కేంద్రం మాత్రం తెలంగాణకు ఇచ్చింది కేవలం రూ. లక్షా 68వేల కోట్లు మాత్రమేనని తెలిపారు.

కానీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు న్యాయంగానే నిధులు ఇస్తోంది అంటూ మంత్రి కిషన్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారని మీరు చెప్పేది నిజమైతే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను..నేను చెప్పేది నిజమని తేలితే మీ మంత్రి పదవికి రాజీనామా చేస్తారా? అంటూ సవాల్ విసిరారు. కిషన్ రెడ్డి చెప్పేది అబద్ధమని తేలితే మీరు రాజీనామా చేయకపోయినా ఫరవాలేదు కానీ తెలంగాణ ప్రజలకు ఆయన క్షమాపణలు చెబుతారా? అంటూ సవాల్ విసిరారు.

తెలంగాణను అభివద్ధి చేయటమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని..అప్పులు చేసినా రాష్ట్ర అభివృద్ధి కోసమేనని తెలిపారు. అప్పులు చేయటం కూడా భవిష్యత్ తరాలకు సంపద సృష్టించటానికేనని అన్నారు. కానీ గత ప్రధానులకంటే మోదీ ప్రధాని అయ్యాక చేసిన అప్పులు ఎక్కువననే సంగతి బీజేపీ గుర్తించాలని సూచించారు. ప్రధాని మోడీ పాలనలో దేశఆన్ని దోచుకున్నవాళ్లే ఎక్కువగా బాగుపడ్డారని విమర్శించారు.

ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మార్పుపై వస్తున్న విమర్శలకు కూడా కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారినా మా అజెండా, డీఎన్ఏ మారదని అభివృద్ధి చేసే విషయంలో కేసీఆర్ కృషిలో కూడా మార్పు ఉండదని అన్నారు కేటీఆర్.