Non-Hindus not allowed: హిందుయేతరులకు నో ఎంట్రీ అంటూ 150గుళ్లలో బ్యానర్లు

హిందూ ఆలయాల్లోకి ఇతర మతస్థులు అడుగుపెట్టడానికి లేదని 150గుళ్లకు పైగా నో ఎంట్రీ బ్యానర్లు కట్టేశారు. గుళ్లలోకే కాదు ఆ పరిసరాల్లో అడుగుపెట్టొద్దంటూ హిందూ యువ వాహిని..

Non-Hindus not allowed: హిందూ ఆలయాల్లోకి ఇతర మతస్థులు అడుగుపెట్టడానికి లేదని 150గుళ్లకు పైగా నో ఎంట్రీ బ్యానర్లు కట్టేశారు. గుళ్లలోకే కాదు ఆ పరిసరాల్లో అడుగుపెట్టొద్దంటూ హిందూ యువ వాహిని రైట్ వింగ్ హెచ్చరిస్తుంది. ఉత్తరాఖాండ్ వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో బ్యానర్లు కట్టేశారు. డెహ్రాడూన్ లోని చక్రతా రోడ్, సుద్ధోవాలా, ప్రేమ్ నగర్ ప్రాంతాల్లో ఇవి దర్శనమిస్తున్నాయి.

ఘాజియాబాద్ లోని దస్నా దేవీ గుడిలో నీటిని తాగినందుకు ఓ ముస్లిం టీనేజర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆ గుడికి సంబంధించిన బోర్డు.. గుడి పరిసరాల్లోకి ముస్లింలను అనుమతించేది లేదంటూ చెప్పేశారు.

ఇప్పుడు ఆ నిర్ణయానికి మద్ధతుగా హిందూ యువ వాహిని హిందుయేతరులు గుళ్లలోకి ప్రవేశించడానికి లేదని చెప్పేశాయి. గుడి అంటే సనాతన ధర్మాన్ని నమ్మే వారికి మాత్రమే అని ఇతర మతాలకు చెందిన వారికి అందులోకి ప్రవేశం లేదని హిందూ యువ వాహినీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ జీతూ రాంధవా అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు