చైనాకు ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకోలేదు..ఆర్మీ చీఫ్

అక్రమంగా సైన్యంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్మీ చీఫ్ మనోజ్​ ముకుంద్​ నరవణె స్పష్టం చేశారు. తప్పని రుజువైతే ఆ వ్యక్తి సైన్యంలో చేరి 20 ఏళ్లు అయినా సరే తక్షణం తొలగిస్తామని తెలిపారు.

inch of land అక్రమంగా సైన్యంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్మీ చీఫ్ మనోజ్​ ముకుంద్​ నరవణె స్పష్టం చేశారు. తప్పని రుజువైతే ఆ వ్యక్తి సైన్యంలో చేరి 20 ఏళ్లు అయినా సరే తక్షణం తొలగిస్తామని తెలిపారు. జాతీయ వార్తా సంస్థకు మంగళవారం నాడు ఇచ్చిన ఇంటర్వ్యూలో నరవణె మాట్లాడుతూ..పరీక్షల నిర్వహణ, ఎంపికల్లో అక్రమాలు జరిగితే పట్టుబడ్డ సందర్భాలు ఉన్నాయి. సర్వీసెస్​ సెలక్షన్ బోర్డు సిబ్బంది అవినీతికి పాల్పడ్డారు. ఇవి మా అంతర్గత దర్యాప్తు ద్వారానే వెలుగులోకి వచ్చాయి. ఇటువంటి ఘటనలను సైన్యం సహించదు. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని తెలిపారు.

ప్రవేశ పత్రం లీక్​కు సంబంధించి అనేక విధాలుగా దర్యాప్తు చేయవలసి ఉంటుందని నరవణె పేర్కొన్నారు. బ్యాంక్​, కాల్​ రికార్డులను పరిశీలించాలని తెలిపారు. ఈ తరహా దర్యాప్తునకు తమకు అధికారం లేదని.. అందుకే ఈ కేసును సీబీఐకి అప్పగించినట్లు స్పష్టం చేశారు.

ఇక, తూర్పు లఢఖ్ లో భారత్-చైనా ప్రతిష్టంభనపై కూడా నరవణె స్పందించారు. చైనాకు ఒక్క అంగుళం భూభాగం కూడా వదులుకోలేదని స్పష్టం చేసిన ఆయన..ఇరు దేశాల మధ్య ఇంకా చర్చలు కొనసాగుతున్నట్టు తెలిపారు. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించేందుకు భారత్ నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. మరోవైపు, వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ వైపున ఇప్పటికీ ఉగ్రవాద శిక్షణ శిబిరాలు, వ్యవస్థలూ కొనసాగుతున్నాయని నరవణె స్పష్టం చేశారు. ఉగ్రవాదం తగ్గుముఖం పట్టాలంటే వీటన్నిటినీ కూల్చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వ్యవస్థల నిర్మూలను పాక్ ఏమేరకు కట్టుబడి ఉందో త్వరలో తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో జరిగిన టెర్రిరిస్టు దాడుల గురించి కూడా ఆయన స్పందించారు. తమ పాచికలు పారక నైరాశ్యంలో కూరుకుపోయిన ఇద్దరు ముగ్గురు టెర్రరిస్టులు దీనికి పూనుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ట్రెండింగ్ వార్తలు