Covid Intestine : కరోనాతో కొత్త ముప్పు.. పేగులపైనా తీవ్ర ప్రభావం

కరోనా అనేక సమస్యలు తెచ్చిపెడుతోంది. అవయవాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. దేహంలోని ఒక్కో అవయవాన్ని టార్గెట్ చేస్తోంది ఈ మహమ్మారి. తాజాగా కరోనా కారణంగా మరో ముప్పు ఏర్పడింది.

Covid Clots In Intestine : ఏడాదిన్నర కావొస్తుంది. అయినా కరోనావైరస్ మహమ్మారి ఇంకా వెంటాడుతూనే ఉంది. యావత్ ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సెకండ్ వేవ్ లో మన దేశంలో మరింతగా విలయతాండవం చేస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఇది చాలదన్నట్టు కరోనా అనేక సమస్యలు తెచ్చిపెడుతోంది. అవయవాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. దేహంలోని ఒక్కో అవయవాన్ని టార్గెట్ చేస్తోంది ఈ మహమ్మారి. తాజాగా కరోనా కారణంగా మరో ముప్పు ఏర్పడింది.

కరోనా మహమ్మారి ఊపిరితిత్తులు, గుండె, మెదడులాంటి అవయవాలపైనే ప్రభావం చూపిస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే ఈ వైరస్‌ ప్రభావం పేగులపైన కూడా తీవ్రంగానే పడుతోందని వైద్యనిపుణులు చెబుతున్నారు. కొవిడ్‌ -19 వల్ల పేగుల్లో పుళ్లు ఏర్పడి, చివరికి కుళ్లిపోయే స్థితికి చేరుకుంటున్నాయని చెబుతున్నారు.

ముంబై పరిసరాల్లోని ఆస్పత్రుల్లో పలువురు డాక్టర్లు జరిపిన సర్వేలో ఈ విషయం బయటపడింది. కరోనా వైరస్‌ బారిన పడి ఆస్పత్రిలో చేరిన కొందరిలో విపరీతమైన కడుపు నొప్పి రావడాన్ని డాక్టర్లు గుర్తించారు. స్కాన్‌ చేసి చూస్తే.. వారి పేగుల్లో పుళ్లు ఉన్నాయని తేలింది. కొవిడ్‌ బారిన పడిన 16-30 శాతం మంది బాధితుల్లో ఈ సమస్య తలెత్తినట్లు గుర్తించారు. బాధితుల పేగుల్లో రక్తం గడ్డలు కడుతోందని, ఫలితంగా పుళ్లు ఏర్పడుతున్నాయని నిర్ధారణకు వచ్చారు. కడుపు నొప్పి భరించలేక కొంతమంది బాధితులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలూ ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు